వైసీపీ అధినేత జగన్ తన రాజకీయ వ్యూహాలను మారుస్తున్నారు.  2027లో ఎన్నికలు జరిగినా లేక 2029లో జరిగినా కూడా కొత్త టీం తోనే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్లను వారి అనుభవాలను వాడుకుంటూనే కొత్త వారికి యంగ్ లీడర్స్ కి చాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు


సీనియర్ నేతలు కూడా తమ వారసులకు టికెట్ ఇస్తే తాము వెనక ఉండి రాజకీయ శిక్షణ ఇచ్చి గెలిపించుకుంటామని జగన్ కు చెబుతున్నారు. నిజానికి 2024లోనే ఇదంతా జరగాలి.  కానీ జగన్ ఒప్పుకోలేదు.  శ్రీకాకుళం నుంచే దానికి శ్రీకారం చుడుతున్నారు అని అంటున్నారు.  ధర్మాన బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులను రంగంలోకి దించుతారు అని అంటున్నారు.  దానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.  శ్రీకాకుళం సీటులో ధర్మాన ప్రసాదరావు తన కుమారుడు రాం మనోహర్ నాయుడిని ముందుకు తెస్తున్నారు.


నరసన్నపేట నుంచి తన కుమారుడు క్రిష్ణ చైతన్యను ధర్మాన క్రిష్ణ దాస్ ముందుకు తెస్తున్నారు. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడిని రంగంలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ కుమారుడికి చీపురుపల్లి బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. విజయనగరంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణికి ఇన్చార్జి బాధ్యతలు ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది.


అలాగే బొబ్బిలి, సాలూరులలో కూడా కొత్త ముఖాలను తెస్తారని అంటున్నారు. విశాఖలో చూసినా సీనియర్ నేతల స్థానంలో కొత్త వారికి లేదా వారసులకు అవకాశం ఇస్తారని అంటున్నారు. అయితే సీనియర్లు పార్టీ కోసం పనిచేయాలని అధినాయకత్వం సూచించే అవకాశం ఉంది అని అంటున్నారు


అందుకే భూమన కరుణాకరరెడ్డి, పేర్ని నాని వంటి వారు గట్టిగా పనిచేస్తున్నారని చెబుతున్నారు.  మొత్తానికి బలంగా సీనియర్లు ఉన్న చోట వారసులను దించడం, లేని చోట కొత్త వారికి చాన్స్ ఇవ్వడం ద్వారా వైసీపీ పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించాలని చూస్తోంది అంటున్నారు. మరి ఈ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: