బిహార్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. 2020 అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా పోటీ చేసి గెలిచింది. నితీష్ కుమార్ జేడీయూ అందులో కీలక భాగస్వామిగా ఉంది. అయితే బీజేపీకి 78 సీట్లు వస్తే నితీష్ కుమార్ కి 45 దాకా వచ్చాయి. దాంతో నితీష్ ని ముఖ్యమంత్రిగా చేస్తారా అని ఆనాడే చర్చ సాగింది. కానీ ఎట్టకేలకు బీజేపీ డెసిషన్ తీసుకుంది.
మధ్యలో పొరపొచ్చాలు రావడంతో ఆయన ఇండియా కూటమి వైపు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ సీఎం గా ఉన్నారు. మళ్ళీ ఎన్డీయే వైపు వచ్చారు. ఎందుకంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బీజేపీ అగ్ర నేత, హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిని మేము నిర్ణయిస్తామని చెప్పడంలోని అర్ధాలను అంతా వెతుకుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ఫలానా వారు లేకుండానే ఎన్నికలకు వెళ్లాయని బీజేపీ నిర్ణయించిందా అన్నది కూడా చర్చకు వస్తోంది.
రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం నితీష్ కుమార్ ప్రధాని మోడీ నాయకత్వంలో బీహార్ ఎన్నికలకు వెళ్ళి గెలిచి వస్తామని చెబుతున్నారు. హర్యానాలోని సూరజ్ కుండ్ లో ఇటీవల జరిగిన బీజేపీ సమావేశంలో కూడా బీహార్ ఎన్నికలలో నితీష్ కుమార్ నాయకత్వమే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కానీ అమిత్ షా లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ చూస్తే ముఖ్యమంత్రి విషయంలో ఈసారి బీజేపీ పట్టుదలగా ఉంటుందని అంటున్నారు.
దేశంలో అతి పెద్ద రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న బీహార్ లో ఈసారి బీజేపీ నుంచి సీఎం కావాలన్నది ఆ పార్టీ పెద్దల సంకల్పం అని చెబుతున్నారు. బీహార్ లో కూడా మహారాష్ట్ర ఫార్ములాను ఉపయోగిస్తారు అని అంటున్నారు. నితీష్ కుమార్ ను కేంద్రంలో కీలక శాఖలకు మంత్రిగా తీసుకుంటారు అని అంటున్నారు. బీహార్ లో ఏకచత్రాధిపత్యం గా అధికారాన్ని అనుభవిస్తున్న నితీష్ కుమార్ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపడతారా అన్నది కూడా చూడాలి.
పైగా ఎన్డీయే ప్రభుత్వానికి జేడీయూ కీలక మద్దతు ఇస్తోంది. ఆ మద్దతు కనుక లేకపోతే ఇబ్బందులో పడుతుంది. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్న క్రమంలో నితీష్ కుమార్ తన రాజకీయ చతురతను వ్యూహాలను బయటకు తీయకుండా ఉంటారా అన్నదే చర్చగా ఉంది.