తెలంగాణాలో ఇపుడు హాట్ ఇష్యూస్ వరసబెట్టి ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ ఇష్యూగా అల్లు అర్జున్ అరెస్ట్ ఆయన మీద పెట్టిన కేసులు ఉన్నాయి. ఇవి కాస్తా ముదిరి పాకాన పడుతున్నాయి.  ఆంధ్రోళ్లు అన్న మాట చాలా కాలం తరువాత మళ్లీ వినిపిస్తోంది.  తెలంగాణా ఆంధ్రా అన్న విభజన కూడా స్పష్టంగా ఏర్పడుతోంది.  


తెలంగాణాలో విపక్షాలు రేవంత్ రెడ్డి సర్కార్ ని ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేస్తున్నాయి. దాంతో కొంతమంది నేతలు వారిని కట్టడి చేయడానికి రీజనల్ బౌండరీస్ ని తెస్తున్నారు అని అంటున్నారు. సస్పెండ్ అయినట్లుగా చెబుతున్న ఒక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ఆంధ్రోళ్లు అంటూ కామెంట్స్ చేశారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అంధ్రోళ్ళు అంటూ అల్లు అర్జున్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడకి వచ్చి వ్యాపారం చేసుకోవాలని లేకపోతే ఆంధ్రాకు వెళ్ళిపోవాలని ఆయన అన్నట్లుగా వచ్చాయి.


దాని మీద బీజేపీ గట్టిగానే పట్టుకుంది.  ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అయితే దీని మీద ఏకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. తెలంగాణాలో ఆంధ్రా వారు నివాసం ఉండాలంటే ప్రత్యేక వీసాలు ఉండాలా అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.  తెలంగాణా ఏర్పాటు అయిన పదకొండేళ్ళ తరువాత కూడా ఈ వ్యాఖ్యలు ఏమిటని ఆయన మండిపడ్డారు. ఇవి రెచ్చగొట్టే మాటలు అని కూడా ఆయన విమర్శించారు.


మొత్తం మీద ఇష్యూ ఒక దాని మీద నుంచి మరో దాని మీదకు వెళ్తోంది అని అంటున్నారు. అల్లు అర్జున్ కేసు విషయంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని అదేశాలు కాంగ్రెస్ పెద్దల నుంచి జారీ చేశారు అని ప్రచారం సాగింది.  అయినా అది కంటిన్యూ అవుతోంది. పైగా ప్రాంతీల మధ్య విభేదాలు వచ్చేలా స్టేట్మెంట్స్ వస్తున్నాయని దీని వల్ల రాజకీయంగా ఎవరికి లాభమో తెలియదు కానీ ఇబ్బందులు కొత్తగా కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు. మరి బీజేపీకి ఇది ఒక అస్త్రంగా మారుతోంది. దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: