ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖకు బూస్ట్ ఇస్తోంది కేంద్రం .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు చెప్పిన కేంద్రం ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుండి ఏపీపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అడిగినవి, ఇవ్వాల్సినవి ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తోంది.


పవన్ కళ్యాణ్ శాఖ అయిన పంచాయతీరాజ్ శాఖకు గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ ను విడుదల చేసింది. 2024 - 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 446.49 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్రం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక పరిపాలన కోసం ఈ నిధులను వినియోగించుకునేందుకు కేంద్రం ఈ నిధులను ఇచ్చింది.


ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండవ విడత కింద ఆంధ్రప్రదేశ్ కు నిధులు విడుదల చేసినట్టు ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రెండు విడతలుగా 446.49 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు పేర్కొంది. మొదటి విడత గ్రాంట్ లో 25.49 కోట్ల రూపాయలు, రెండవ విడుదల విడుదల చేసిన 420. 99కోట్ల రూపాయలు కలిపి మొత్తం 446.49 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది.


ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1397 గ్రామపంచాయతీలు, 650 మండల పరిషత్తులు, 13 జిల్లా పరిషత్ లు అభివృద్ధి చేసుకునే వీలు కలుగుతుందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసే ఈ నిధులు గ్రామీణ ప్రాంతాలలోని మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు.


ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయగా తాజాగా రెండవ విడత నిధులను కూడా విడుదల చేసినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. మొత్తంగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన శాఖకు నిధులు విడుదల చేసి కేంద్రం తీపి కబురు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: