భారత గడ్డపై సీపీఐ పార్టీ వందేళ్ళు పూర్తి చేసుకుంది. శత వార్షికోత్సవాలను జరుపుకుంటోంది. ఇందుకు దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటిని  జయప్రదం చేయాలని తన ఎర్ర సైన్యానికి పిలుపు ఇస్తోంది. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆవిర్భవించి 99 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంటే నేటికి వందేళ్ళన్నమాట. 1925 , డిసెంబర్ 26 ఉత్తరప్రదేశ్ లోని  కాన్పూర్ లో ఈ సీపీఐ పార్టీ ఆవిర్భవించింది.


బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా  భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సీపీఐ అని ఆ పార్టీ చెబుతోంది. దేశంలో వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, సీపీఐ మాత్రమే ఉండటం విశేషం. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మంది సీపీఐ నేతలు త్యాగాలు చేశారు. కొందరు జైలు కెళ్లారు. మరికొందరైతే ప్రాణాలు సైతం తృణపాయంగా అర్పించారు కూడా.


ఆ పోరాటంలో పాల్గొన్న వారందరినీ స్వాతంత్ర సమరయోధులుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. సీపీఐ మొదటి నుంచి పేదల పార్టీగా గుర్తింపు పొందింది. భూముల కోసం, భుక్తి , విముక్తి కోసం పోరాటాలు చేసిన పార్టీగా సీపీఐ గుర్తింపు పొందింది. స్వాతంత్ర్యం తర్వాత కూడా సీపీఐ  కష్ట జీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేసింది. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, త్యాగాలను ఈ తరం యువతరం తెలుసుకోవాలని ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు.


పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ఎర్ర పార్టీ ఏళ్ల తరబడి అధికారంలోనూ ఉంది. తన మార్కు పాలన సాగించింది. అయితే.. అనేక కారణాలతో ఈ పార్టీ ప్రతిష్ట ఇప్పుడు మసకబారింది. ప్రస్తుతం ఒక్క కేరళలో తప్ప ఎక్కడా అధికారంలో లేదు. అందులోనూ సీపీఐ పార్టీ తర్వాత కాలంలో సీపీఐ, సీపీఎంగా విడిపోయింది. కాలానుగుణంగా మారకపోవడం, రాజకీయాల్లో పెరిగిపోయిన ధన, కుల, మత ప్రభావాల కారణంగా సీపీఐ తన ప్రభ కోల్పోయింది. మరి మళ్లీ ఆ ఎర్ర జెండా మళ్లీ ఎగురుతుందా?


మరింత సమాచారం తెలుసుకోండి: