అందువల్ల ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలన్న రేవంత్ రెడ్డి.. నియోజక వర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు. చట్ట సభలలో మహిళ బిల్లును కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశ పెట్టి ఒక కొలిక్కి తెచ్చినామన్న రేవంత్ రెడ్డి.. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై మనం ఎక్కవగా ప్రచారం చేయాలని సూచించారు.
బీజేపీ మహిళ బిల్లుతో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని.. ఆ విషయంలో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కులగణన తెలంగాణలో దేశంలోనే మార్గదర్శిగా ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి... కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగనన లో దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలన్నారు.
ఈ విషయంలో సిడబ్ల్యుసి ఒక తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనను సిడబ్ల్యుసి తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించింది. రేవంత్ రెడ్డి కులగణన సూచనకు ప్రాధాన్యం దక్కడంతో తెలంగాణలోని ఆయన వర్గం ఆనందంలో మునిగి తేలుతోంది. పార్టీ అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి పరపతి పెరిగిందనడానికి ఇదే నిదర్శనం అని ఆయన వర్గం చెబుతోంది.