అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం కల్పించాలని పవన్ కల్యాణ్ సూచించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.


మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న  జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అనీ, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం పవన్ కల్యాణ్ చేశారు.


గాలివీడు ఎంపీడీఓపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చించారు. కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని పవన్ కల్యాణ్ సూచించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని పవన్ కల్యాణ్ అన్నారు.


దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని పవన్ కల్యాణ్ చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించీ వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. పవన్‌ కల్యాణ్‌ నుంచి గట్టి ఆదేశాలు రావడంతో పోలీసులు కూడా లాఠీలకు పని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యుడైన  వైసీపీ నాయకుడిని పోలీసులు కొట్టుకుంటూ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: