- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .


నేటి రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల నేప‌థ్యంలో ఎప్పుడు ? ఎవ‌రు ఏ పార్టీలో ఉంటారో ?  ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ‌తారో ? ఎవ్వ‌రికి తెలియ‌ట్లేదు. ఈ క్ర‌మంలోనే నిన్న‌టి వ‌ర‌కు వైసీపీ ఎమ్మెల్సీ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన ఎంట్రీ కి రంగం సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు టాక్ ?  బీసీల‌లో ఆదరణ కలిగి మంచి పేరున్న వెంకటరమణ ఎంట్రీ జనసేనకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టి .. వ‌డ్డీల సామాజిక వ‌ర్గంలో పార్టీ బలపడుతుందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. గతంలో జనసేన పార్టీ నాయకుడిగా జనసేనపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బి వి రావు పార్టీ మారిన తరువాత ఇప్పటివరకు కైకలూరు నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీకి నియోజకవర్గస్థాయి నాయకులు లేరు. దీంతో జ‌న‌సేన కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం మండలాల నాయకులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


నిన్న‌టి వ‌ర‌కు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ గా ఉన్న జ‌య‌మంగ‌ళ త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి తో పాటు వైసీపీ కి కూడా రాజీనామా చేసేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీ పెద్దలతో సంప్రదింపుల అనంతరం కొత్త సంవత్సరం 2025 లో జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే విధంగా రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది కైకలూరు మండలం చిన్న కొట్టాడా గ్రామం నుండి జడ్పిటిసి గా రాజకీయాలలోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో తిరుగులేని బీసీ నేతగా ఎదిగిన ర‌మ‌ణ‌.. ఆ త‌ర్వాత అనూహ్యంగా 2009 ఎన్నిక‌ల్లో మూడు ముక్క‌లాట‌లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు.


ఎవరినైనా నమ్మి ఆదరించటం, వల్ల రాజకీయాలలో నష్టపోవడం కొంత జరిగింది. తన జీవితంలో ఇతరులకు మేలు చేయటమే కానీ, అపకారం తలపెట్టని, వ్యక్తిత్వం ఉన్న నేత వెంక‌ట ర‌మ‌ణ అని ఆయ‌న గురించి ద‌గ్గ‌ర‌గా తెలిసిన వారు చెపుతూ ఉంటారు. ఏదేమైనా వెంక‌ట ర‌మ‌ణ జన‌సేన లో చేరితే ఆ పార్టీకి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ల‌స్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: