తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు.. అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ పోటీ చేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారట. తెలంగాణలో పార్టీకి నాయకత్వం లేదు గాని.. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు, నారా లోకేష్ కసరతులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికీ తెలంగాణలో.. తెలుగుదేశం పార్టీకి గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన పట్టు ఉంది. ఈ రెండు చోట్ల అధ్యక్షులు ఉన్నారు. టీడీపీ అధ్యక్ష పదవి రేసులో.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు.. మాజీమంత్రి బాబు మోహన్.. బీసీ కోటాలో పార్టీ సీనియర్ నేత అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు.
టీడీపీ తెలంగాణలో కార్యకర్తలపై మొదలుపెడితే.. బిజెపితో పాటు బీఆర్ఎస్ నుంచి కూడా కొందరు నాయకులు టీడీపీలోకి వెళ్ళవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని టాక్ వచ్చిన టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ విజయ అవకాశాలు దెబ్బతింటాయని.. రేవంత్ రెడ్డి చెప్పడంతోనే చంద్రబాబు ఆగిపోయారని అంటారు. అయితే ఏపీలో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న చంద్రబాబు తన దృష్టి మొత్తం ఏపీ మీదే పెట్టారు. ఇక ఇప్పుడు తెలంగాణలో మళ్లీ పట్టు కోసం చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టి ఎంతో కొంత ఓటు బ్యాంకు చేర్చితే.. అది కాంగ్రెస్, బిజేపి, బిఆర్ఎస్‌లలో ఎవరికి ప్లస్ అవుతుంది.. ఎవరికి మైనస్ అవుతుంది అన్న చర్చలు కూడా తెరమీదకి వస్తున్నాయి.