ఇప్పుడున్న కాలంలో రాజకీయాల్లో పదేళ్లు కొనసాగటం అంటే చాలా కష్టం. అలాంటిది నాలుగున్నర దశాబ్దాలు పాటు రాజకీయాల్లో కొనసాగుతూ ఇప్పటికీ అదే ఉత్సాహంతో.. అదే జోష్తో ముందుకు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. రాజకీయాల్లో ఎత్తు పల్లాలు, గెలుపు, ఓటమిలో అటు.. ఇటు.. మారుతూ ఉంటాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ తండ్రి, కొడుకులను ఎదుర్కొని మూడోతరం రాజకీయ నాయకులను కూడా ఎదుర్కొని.. ఒకే ఒక్కడుగా పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన ఈ ఏడాది సాధించిన విజయం అలాంటిది.. ఇలాంటిది.. కాదని చెప్పాలి.


23 సీట్లకు పరిమితమైన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం.. వృద్యాప్యం అనేది తన శరీరానికి సంబంధించిందే తప్ప.. తన వ్యూహాలను, రాజకీయ చాతుర్యాన్ని, తన ఆకాంక్షను ఏమాత్రం ప్రభావితం చేయజాలదని నిరూపించిన నాయకుడు చంద్రబాబు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వయసు పెరిగిన కొద్ది చంద్రబాబు వ్యక్తిత్వం మరింత వికసిస్తుంది. తనను తాను సమర్ధపాలకుడిగా మరింతగా నిరూపించుకునేందుకు తపనతో ఆయన కష్టపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య ఫ‌లితాలు నిలబడటం వెనక చంద్రబాబు కష్టం ఉంది. ఆయన ఏపీలో అత్యంత బలమైన ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. కేంద్రంలో అధికార కూటమిలో రెండో అత్యంత బలవంతుడైన నాయకుడు.


అలాగని కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకుడు అనే పదాలు కూడా మీడియా లో దొర్ల కుండా . . చాకచక్యంగా తన పనులు మాత్రం చక్కబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నో అవమానాలు భరించి.. ఎన్నో అవహేళనలు ఎదుర్కొని.. సహనం వహించినందుకు బ్యాలెన్స్ తప్పని రాజకీయం చేసినందుకే.. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ఎందరో రాజకీయ నాయకులు ఉన్నా.. ఈ ఏడాది చంద్రబాబు సాధించిన అప్రతిహతమైన ఘనవిజయం మాత్రం తెలుగు రాజకీయాల చరిత్రలో ఎప్పటికీ చెక్కుచెదరనిదిగా అలా నిలిచిపోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: