ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కానుంది.  భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి పాలన పైన ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది.  ఇదే అంశం పైన ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసిన రాబిన్ శర్మ టీం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్ తో సిద్దమైంది. ప్రభుత్వానికి అలర్ట్స్ ఇచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వంలోనూ రాబిన్ శర్మ సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాలనలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందు కోసం రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ టీం సేవలను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు.  దీని కోసం చీఫ్‌ మినిస్టర్‌ ఫెలోస్‌ అనే పేరుతో యువ టీంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ  టీం క్షేత్ర స్థాయి లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం.. లోటు పాట్ల గురించి నేరుగా ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఇప్పటికే ఇటువంటి బృందాలు కొనసాగుతున్నాయి.  దీని కోసం 25 మందితో టీం ఏర్పాటు చేయనున్నారు.  



ప్రభుత్వ నిర్ణయాలు - పథకాల అమలు విషయంలో రాబిన్ శర్మ కూటమి ప్రభుత్వానికి సహాయకారిగా పని చేయనుంది. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకొని సూచనలు, సలహాలు ఇవ్వడానికి కొత్తగా ఒక టీం పని చేయనుంది. రాబిన్‌ టీంలో కీలక సభ్యుడు శంతన్‌ స్థానంలో నియమితుడైన అనంత్‌ తివారీ నేతృత్వంలో ఈ కొత్త బృందం ప్రభుత్వానికి సహాయకారిగా పని చేయనుంది. దీనిని పార్టీ తరపున ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని మంత్రులందరి వద్ద నియమించనున్నారు.



ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఇప్పటికే పలు మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు ఎలా పని చేస్తున్నారనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఏడు నెలల పాలన దాదాపు పూర్తి కానుండటంతో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అనూహ్య విజయానికి సహకరించిన రాబిన్ శర్మ టీం ను ఇప్పుడు తిరిగి రంగంలోకి దించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పబ్లిక్ మూడ్ పైన ఈ టీం నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. కొన్ని అలర్ట్స్ ఇచ్చింది.  దీంతో, వీరి సేవలను కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: