సినిమాలలో మనం మల్టీస్టారర్ సినిమాలు చూస్తూ ఉంటాం. మల్టీస్టారర్ సినిమాలో హిట్ అవుతూ ఉంటాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - టాలీవుడ్ యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ష‌న్‌లో వచ్చిన మల్టీ స్టార‌ర్ సినిమా.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూశాం. అయితే 2024 సంవత్సరంలో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ మల్టీస్టారర్ సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పాలి.


2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఆ ఎన్నికలలో పోటీ చేయకుండా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బిజెపికి సపోర్ట్ చేసి.. ఆ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చేందుకు తన వంతుగా కృషి చేశారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. ఐదేళ్ల చంద్రబాబు పాలనను బీభత్సంగా తిట్టిపోశారు. లోకేష్‌ను సైతం విమర్శించారు. అసలు ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో ఎప్పటికీ తిరిగి స్నేహం చేయవు అనంతగా వ్యవహారం చేడింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లి బిజేపితో కలిసిపోయారు.


అలాంటి బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటానికి చంద్రబాబు తన రాజకీయ చాతుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు తో పాటు.. అటు పవన్ కళ్యాణ్ కూడా తనను తాను తగ్గించుకున్నారు. ఈ రెండు పార్టీలకు తోడు బిజెపి కూడా వచ్చి చేరింది. మూడో పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని గ‌ద్దెదించే వరకు విశ్రమించలేదు.. నిద్రపోలేదు. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ మల్టీస్టారర్ సూపర్ డూపర్ హిట్ అయింది. వీరు సాధించిన అప్రతిహత విజయం భారతదేశ రాజకీయ చరిత్రలోనే గొప్ప విజయంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: