సాధారణంగా ఎవరికి అయినా వయసు పెరుగుతూ ఉంటే వయసు మీద పడుతూ ఉంటే గ్లామర్ తగ్గుతూ ఉంటుంది. వారి క్రేజ్ వారి చరిష్మా తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు పూర్తి విరుద్ధం అని చెప్పాలి. వయసు పెరుగుతున్న చంద్రబాబు క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది. చంద్రబాబులో పరిణితి రోజురోజుకు డబుల్ అవుతోంది. నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మరింత పరిణితి గల పాలకుడుగా దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో కూటమికి అధికారం దక్కింది. కూటమిలో అన్ని పార్టీలు అమరావతి రాజధానికి అనుకూలమైనవే. అమరావతి రాజధాని పోల‌వ‌రంను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు.


ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి అమరావతి పనులు అస్సలు పట్టించుకోలేదన్న విమర్శలను నిజం చేస్తూ.. అమరావతిలో అభివృద్ధి అంటే ఏంటో ఆయన రుచి చూపిస్తున్నారు. కేంద్రంలో ఆయన రెండో అతిపెద్ద పార్టీకి రథసారథిగా ఉండటం చంద్రబాబుకు ఈ దశలో పట్టిన అదృష్టం అని చెప్పాలి. గతంలో మాదిరిగా ఆయన విజ్ఞప్తులను ఏకపక్షంగా తోచిపుచ్చలేని స్థితిలో ఈసారి మోడీ సర్కారు ఉంది. అందుకే పథకాలకు రాజధానికి, పోలవరానికి బాగా సాయం అందుతుంది. ఏ పనులు ప్రజల ఎదుటకు, ప్రజలకు కనిపిస్తాయో.. ఏ పనులు మంచి పేరు కీర్తి తెచ్చి పెడతాయో.. అలాంటి పనుల మీద చంద్రబాబు దృష్టి పెట్టడం ఆయన తాజా రాజనీతికి నిదర్శనం.


వయసు పెరుగుతున్న కొద్దీ మనిషిలో సహనం - శక్తి తగ్గుతాయని అంటూ ఉంటారు. కానీ.. చంద్రబాబు ప్రత్యేకమైన వ్యక్తి 75 ఏళ్ల వయసులో ఆయన పెట్టిన చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అసూయ కూడా కలుగుతుంది. స‌మీక్ష సమావేశాల పేరిట నిరంతరాయంగా కూర్చోవడం కూడా సులువేమీ కాదు. ఆయనలో వయతో పాటు శక్తి మాత్రమే కాదు.. సహనం కూడా పెరుగుతున్నాయని మనం గమనించాలి. ఏది ఏమైనా ఈ ఏడాది భారతీయ రాజకీయ యువనిక‌ పై పొలిటికల్ పర్సన్ ఆఫ్ ది హీరోగా చంద్రబాబును అభివర్ణించడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: