అసోసియేట్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. అత్యధిక సంపాదన కలిగిన ముఖ్యమంత్రులలో చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉన్నారు.  ఆయన ఆస్తుల విలువ దాదాపు ₹931 కోట్లుగా తేలింది. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో అత్యధికంగా ఆస్తులు కలిగి ఉన్న సీఎంగా చంద్రబాబు ప్రధమ స్థానంలో ఉండడం విశేషం.



చంద్రబాబు చరాస్తుల విలువ 810 కోట్లు. స్థిరాస్తుల విలువ 121 కోట్లు. జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఆస్తుల విలువ 332 కోట్లతో రెండవ స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 51 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ కోటి, జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా 55 లక్షల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. అత్యంత బీద ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అని తేలింది. ఆమె ఆస్తులు కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమేనట.  ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.



తెలంగాణ సీఎం ఆస్తుల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆస్తుల విలువను ఏడీఆర్ రూ.30.04 కోట్లుగా పేర్కొంది. అదే సమయంలో రేవంత్ రెడ్డికి రూ.1.3 కోట్లు అప్పులు కూడా ఉన్నాయి. పలువురు సీఎంపై క్రిమినల్ కేసులు కూడా ఉండగా తెంలగాణ సీఎం రేవంత్ రెడ్డిపై దేశంలోనే అత్యంత ఎక్కువ కేసులు ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి.


గతంలో వాజ్ పేయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు.  నాడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన కేంద్రంలో చక్రం తిప్పారు.. మళ్లీ ఇన్నాళ్లకు చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లభించింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. చంద్రబాబు తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: