పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి శత్రువుగా మారింది. అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్‌కి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైతే షేక్ హసీనా పదవీ నుంచి దించేసి, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. హిందువులపై అరాచకాలు చేస్తూ, మరో పాకిస్తాన్‌గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.


ఇదిలా ఉంటే, దాదాపుగా 50 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ పరిణామం భారత్‌కి ఆందోళనకరం. ఇటీవల కాలంలో అన్నీ మరిచిపోయి బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు స్నేహాన్ని పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 2025 నాటికి, పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. 1971 లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ సైన్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి.


పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ సైన్యాల మధ్య సహకారం కోసం ఒప్పందం కుదిరినట్లు నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ కంటోన్మెంట్ నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.  నాలుగు కంటోన్మెంట్లలో కూడా పాక్ ఆర్మీ శిక్షణ ఇవ్వబోతోంది.



బంగ్లాదేశ్‌లోకి పాకిస్తాన్ చొచ్చుకువస్తోంది. గతంలో పాకిస్తాన్ నౌకలపై ఉన్న ఆంక్షలను యూనస్ ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో యథేచ్చగా పాక్ నౌకలు బంగ్లాలోకి రావొచ్చు. ఇటీవల కరాచీ నుంచి చిట్టగాంగ్ రేపుకు పాక్ నుంచి కార్గో నౌకలు వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి ఆయుధాల కొనుగోలుని వేగవంతం చేసింది.


ఇవన్నీ చూస్తే, బంగ్లాదేశ్ టార్గెట్ భారత్ అని తెలుస్తోంది. దీనికి తోడు బంగ్లాదేశ్‌లో పాక్ ప్రమేయం పెరిగితే భారత ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాద, వేర్పాటువాద శక్తులకు ఆర్థిక, ఆయుధ సాయం దక్కే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకతను పాకిస్తాన్ రెచ్చగొడుతుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో తిరుగుబాటుని పాక్ దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తే బంగ్లాదేశ్‌ని ఉపయోగించుకుని భారత్‌ని అస్థిరపరిచే  కుట్రకు పాకిస్తాన్ తెరతీస్తోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: