మరి కొద్ది రోజులలో ఏపీలో ఒక విశేషం జరగబోతోంది. దేశ రాజకీయాల్లో కూడా ఇది జరిగి ఉండదు.  ఒకే ప్రభుత్వం తండ్రీ కొడుకులు పదవులలో ఉండడం అన్నది చాలా చోట్ల జరిగింది కానీ దావోస్ వంటి చోట పెట్టుబడుల సదస్సుకు తండ్రీ కొడుకులు సీఎం మినిస్టర్ హోదాలో కలసి వెళ్ళడం ఎక్కడా జరగలేదు.


ఈ నెల 20 నుంచి 24 వరకూ అయిదు రోజుల పాటు దావోస్ లో జరిగే పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలసి హాజరు కాబోతున్నారు.  టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తరువాత దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం తొలి సదస్సు ఇది.


గత ఏడాది తెలంగాణా సీఎం గా రేవంత్ రెడ్డి దావోస్ సదస్సుకు వెళ్లారు.  జూన్ 12న అధికారాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిన వెంటనే నారా లోకేష్ కొద్ది నెలల తేడాలో అమెరికా టూర్ పెట్టుకున్నారు.  గూగుల్ సంస్థలతో పాటు అనేక కంపెనీ అధిపతులను కలసి ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వాటి ఫలితాలు తొందరలో వస్తాయని అంటున్నారు.


ఈ నేపథ్యంలో మరింత పట్టుదలగా చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్తున్నారు.  ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని రావాలని చూస్తున్నారు లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం దానికి తగినట్లుగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మొత్తం తమ అయిదేళ్ల పాలనలో లక్ష కోట్ల పెట్టుబడులు కనుక ఏపీకి వస్తే దాని నుంచి ఇరవై లక్షల దాకా ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆ విధంగా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని అదే సమయంలో ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి బాటను పడుతుందని కూడా అంచనా వేసుకుంటున్నారు.  



అదే విధంగా ఏపీ గ్రోత్ రేట్ కూడా పెరిగి దేశంలో అభివృద్ధి చెందిన టాప్ ఫైవ్ స్టేట్స్ లో ఒకటిగా ఉంటుందని ఉండాలని భావిస్తూ చంద్రబాబు లోకేష్ దావోస్ టూర్ ని పెట్టుకున్నారు. మరో విశేషం ఏంటంటే చంద్రబాబు తొలి విదేశీ టూర్ ఇదే కావడం.  ఆయన నాలుగవ సారి సీఎం అయ్యాక ఈ టూర్ చేస్తున్నారు.   ఒక విధంగా చంద్రబాబు లోకేష్ ల దావోస్ టూర్ ఏపీకి ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: