హైదరాబాద్‌కు మరో మణిహారం అందుబాటులోకి వస్తోంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీన ప్రారంభించబోతున్నారు. ప్రధాని మోదీ వర్చువల్‌ గా ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భాగ్యనగర మణిహారంలో చర్లపల్లి టెర్మినల్ మరొక మణిపూసగా చేరనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ అభివృద్ధే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ సారథ్యంలో దేశమంతా రైల్వేరంగం అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.


భారతదేశానికి స్వాంతంత్ర్యం సిద్ధించిన తర్వాత తెలంగాణలోనే మొట్టమొదటి టెర్మినల్ గా చర్లపల్లి టెర్మినల్ చరిత్రలో నిలిచిపోనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో నెలకొన్న ప్రయాణికుల రద్దీని తగ్గించేలా దోహదపడుతూ ప్రతి రోజు సుమారు 24 ట్రైన్లు చర్లపల్లి టెర్మినల్ కేంద్రంగా రాకపోకలు సాగించనున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాబోయే కాలంలో గూడ్స్ రైళ్ల రాకపోకలకు కేంద్రంగా హైదరాబాద్ పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఈ టెర్మినల్ మరింత దోహదపడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.


కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రైల్వే ట్రాక్ ల నిర్మాణం, వరల్డ్ క్లాస్ లెవల్ లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తేవడం కేవలం మోదీ ప్రభుత్వానికే సాధ్యమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా 32 వేల కోట్లు కేటాయించి, 40 రైల్వేస్టేషన్లను, పలు రైల్వేలైన్లను ఆధునీకరించడం, 5 వందే భారత్ ట్రైన్లను కేటాయించడం తెలంగాణ పట్ల బిజెపికి ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చూపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.


బిజెపి ప్రభుత్వం కేవలం ఒక్క 2024-25 బడ్జెట్ లోనే 5,336 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఏ ఒక్క సంవత్సరం బడ్జెట్ లో ఇన్ని నిధులు కేటాయించడం సాధ్యపడలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: