అశ్వరావుపేట మంత్రి తుమ్మలకు సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలోని గుండుగులపల్లి తుమ్మల స్వగ్రామం.. ఇక తన సొంత నియోజకవర్గంలో పై పట్టు కోసం తుమ్మల ప్రయత్నిస్తూ వస్తున్నారు. వాస్తవానికి బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆదినారాయణ.. తుమ్మల అనుచరుడిగా ఉండేవారు. అయితే ఎన్నికలకు ముందు అందరూ పార్టీ మారినప్పుడు ఆదినారాయణ.. పొంగులేటి వర్గంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పుడు తుమ్మల సహకారం కూడా ఉండడంతో ఆదినారాయణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ టికెట్ వచ్చింది.
ఆదినారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏకంగా 29వేల ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆదినారాయణ పొంగులేటి కనుసన్నల్లో నడుస్తున్నారు. ఆయన చెప్పినట్టు చేస్తూ ఉండటం తుమ్మల అనుచర వర్గం లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. ఏఎంసీ చైర్మన్ పదవి విషయంలో తుమ్మల మాట చెల్లుబాటు కాలేదు. దీంతో ఇప్పుడు నియోజకవర్గం లో కాంగ్రెస్ క్యాడర్ రెండుగా చెలిపోయింది. ఇప్పటివరకు పొంగులేటి వర్గానికి మగ్గు చూపుతూ వస్తున్న ఆదినారాయణ.. ఇప్పుడు తుమ్మల వర్గనికి గట్టిగా ఎదురు తిరుగుతూ ఉండడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏదేమైనా ఇద్దరు మంత్రుల అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం చేస్తున్న పోరాటంలో .. స్థానిక ఎమ్మెల్యేగా ఆదినారాయణ నలిగిపోతున్న పరిస్థితి ఉంది.