గడిచిన దశాబ్దాల కాలంలో భారత్ పేద దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ పిల్లలు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణిస్తున్పారు. నాలుగేళ క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా చాలా మంది జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ ఇండియా నిర్వహించిన సర్వేలో భారత్‌లో గామీణ జనాభా గణనీయంగా తగ్గిపోయింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది.
గడిచిన 12 ఏళ్ల క్రితం భారత్‌లో పేదరికం 21.2 శాతంగా ఉందని.. అది 2022-24 నాటిక ఏకంగా 12.7 శాతం మేర పడిపోయి 4.86 శాతానికి తగ్గినట్లు తెలిపింది. 2022- 24 లో దేశంలో పేదరికం 4.86 శాతంగా నమోదైనట్లు తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం.. ఈ వేవ్ 3 సహా వేవ్ 1, వేవ్ 2 సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు సర్వే తెలిపింది. ఎస్‌బీఐ నివేదిక ప్రకారం దేశంలో 2004- 05 మధ్య పేదరికం 38.6 శాతంగా ఉంది. ఇక 2011- 12 నాటికి అది 21.2 శాతానికి పడిపోయింది.
తర్వాత పలు సవాళ్లు ఎదురయ్యాయి. కోవిడ్ విజృంభించడం, ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా గ్రామీణ వ్యసాయంపై కరోనా ప్రభావంత అంతగా లేదు. దీంతో పేదరిక 2022-24 నాటికి 4.86 శాతానికి తగ్గిందని వెల్లడించింది.
ఇక ఇటీవల నీతి ఆయోగ్ నిర్వహించిన సర్వే కూడా దేశంలో పేదరికం 5 శాతం తగ్గినట్లు తెలిపింది. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యన్ నిర్వహించిన వినియోగదారు వ్యయ సర్వే తెలిపింది. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుందని పేర్కొంది. పట్టణ గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా మారుతున్నాయని పేర్కొంది. అలాగే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసుల లెక్కల ప్రకారం కుటుంబ వినియోగ ఖర్చు 2011-12తో పోలిస్తే దారిద్య్ర రేఖను గ్రామీణ ప్రాంతాల్లో రూ.447గా నిర్ణయించగా, పట్టణ ప్రాంతాల్లో రూ.579గా నిర్ణయించారు. 2004-05 మధ్య ఈ రేఖను రాష్ట్రాల వారీగా మార్చారు. 2011-12 నాటి ప్రణాళిక సంఘం ఈ విలువను రూ.860, రూ.1000 గా మార్చింది.
గ్రామీణ పేదరికం తగ్గడానికి ఎస్‌బీఐ కొన్ని కారణాలను తెలిపింది. పేదలకు ప్రభుత్వం మద్దతు తెలిపింది. అదే విధంగా డీబీటీ, ప్రభుత్వ మద్దతు ధరల్లో మార్పు, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, రైతుల ఆదాయం పెంచడం వంటి కారణాలతో గ్రామీణ పేదరికం తగ్గినట్లు వివరించింది. ప్రభుత్వాలు కూడా పేదలకు సంక్షేమం కోసం పని చేస్తుండడం, విరివిగా రుణాలు అందిస్తుండడం కారణంగా కూడా పేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వెల్లడించింది.