భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏడాదిన్నగా తాత్కాలిక అధ్యక్షుడు కొనసాగుతున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం బండి సంజయ్‌ను తప్పించి కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బాగా నష్టపోయింది. ప్రస్తుతం అన్ని ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్త సారథి ఎంపిపై అధిష్టానం దృష్టి పెట్టింది.
2019 నుంచి 2023 వరకు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్‌ను ఢీకొని బీజేపీకి మంచి ఊపు తెచ్చారు బండి సంజయ్. దీంతో ఆయన అయితేనే ప్రస్తుత కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే తెలంగాణ బీజేపీ పగ్గాల కోసం బీసీ కోటాలో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పోటీ పడుతున్నారు. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారు. అధిష్టానం మాత్రం సంజయ్ అయితేనే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
గతంలో అధిష్టానం అంచనాలకు తగినట్లుగా సంజయ్ పనిచేశారు. రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించారు. తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి 40కిపైగా స్థానాల్లో గెలిచేలా కృషి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి మంచి ఊపు రావడానికి కారణం సంజయ్.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఎంపీలు అరవింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే బండి సంజయ్‌పై ఉన్న నమ్మకంతో కమలం పెద్దలు ఆయన అయితేనే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించి ఈటల రాజేందర్‌కు పదవి ఇస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని మార్చాలని కమలనాథులు ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలం పెంచేందుకు, మరింత పోటీ పెంచేందుకు సంజయ్ కావాలని పెద్దలు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే… తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను లేనని బండి సంజయ్ ఇటీవలే తెలిపారు. తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. తెలంగాణ పగ్గాలు తనకు ఇస్తారనేది ఊహాగానాలే అని చెప్పారు. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ తరుణంలో బీజేపీ సారథి సంజయ్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి.