పాత్రల్లో, పాటల్లో హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న అనంత శ్రీరామ్.. చాలా ఏళ్లుగా సినిమాల్లో కర్ణుడి పాత్రకు గొప్పదనం ఆపాదిస్తున్నారని విమర్శించారు. తాజాగా కల్కి చిత్రంలోనూ కర్ణుడిని గొప్పవాడిగా చూపారని అనంత శ్రీరామ్ అన్నారు. అగ్నిదేవుడు ఇచ్చిన ధనుస్సును పట్టిన అర్జునుడి కంటే.. సూర్యదేవుడు ఇచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడిని వీరుడు అంటే ఒప్పుకుంటామా అని నిలదీశారు. యుద్ధంలో నెగ్గేది ధర్మమా.. ధనుస్సా అని ప్రశ్నించారు.
రామాయణంపై కూడా సినిమాల్లో ఎన్నో వక్రీకరణలు వచ్చాయని.. ఇలాంటి వక్రీకరణలను ఇంకా ఎన్నాళ్లని ఊరుకుంటామని అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. ధమ్ మారో ధమ్.. పాటలో హరేక్రిష్ణ హరేరామ్ నినాదం వాడారని.. ఇలా హిందూధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలని అనంత శ్రీరామ్ పిలుపు ఇచ్చారు. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్ప మార్గమన్న అనంత శ్రీరామ్.. మనం తిరస్కరిస్తే.. ఆ సినిమాలకు డబ్బులు రావని.. డబ్బులు రాకుండా అలాంటి సినిమాలు ఏ నిర్మాతా తీయడని అన్నారు.
అయితే ఇప్పుడు అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి. అనంత శ్రీరామ్.. ఒక విధనంగా ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి ప్రభాస్ వరకూ అందరినీ తప్పుబట్టినట్టే. మరి అలాంటి బడా హీరోలపైనా తీవ్రమైన కామెంట్ చేసిన వ్యక్తికి ఇప్పుడు సినిమా రంగం అవకాశాలు ఇస్తుందా అన్నది అనుమానమే అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?