విజయవాడ హైందవ శంఖారావం సభలో విశ్వ హిందూ పరిషత్తు డిక్లరేషన్‌ ప్రకటించింది.  హిందూ దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కలిపిస్తూ చట్టసవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్‌ చేసింది. హిందు ఆలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులు సరి కాదన్న విశ్వ హిందూ పరిషత్తు ప్రతినిధులు.. అన్యాయంగా, చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినాయకచవితి, దసరా వేడులకు ప్రభుత్వం నుంచి ఆర్ధిక భారం, అక్రమ ఆంక్షలు తగవని విశ్వ హిందూ పరిషత్తు తెలిపింది.


హిందూ దేవీ దేవతల శోభా యాత్రల మార్గాలు, తేదీలు, విధానాలపై అక్రమ ఆంక్షలు తగవని విశ్వ హిందూ పరిషత్తు పేర్కొంది. అలాగే ఆలయాల్లో పూజ, ప్రసాద, కైంకర్య సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేసింది. హిందూ ఆలయాల్లో అన్య మత ఉద్యోగులను తక్షణం తొలగించాలన్న విశ్వ హిందూ పరిషత్తు.. ట్రస్టు బోర్డులో హిందూ ధర్మంపై శ్రదాభక్తులు కలిగిన వారినే సభ్యులుగా నియమించాలని పేర్కొంది.


రాజకీయేతర ధార్మిక వ్యక్తులను ట్రస్టుబోర్డుల్లో చోటు కల్పించాలన్న విశ్వ హిందూ పరిషత్తు.. హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని డిమాండ్ చేసింది. సుప్రీం కోర్టు తీర్పుప్రకారం అన్యా క్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేసింది. హిందూ ఆలయాల ఆదాయాన్ని ధార్మిక ప్రచారానికి, సమాజ సేవకు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని విశ్వ హిందూ పరిషత్తు షరతులు పెట్టింది.


అలాగే ఆలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు దారి మళ్లించరాదని విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేసింది. హైందవ శంఖారావం డిక్లరేషన్‌ను సభకు వచ్చిన అందరితోనూ  చిన జీయరు స్వామి  ప్రతిజ్ఞ చేయించారు. ఈ హైందవ శంఖారావం సభ.. తెలుగు రాష్ట్రాల్లో హిందువుల చైతన్యానికి గుర్తుగా విశ్వ హిందూ పరిషత్తు ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సభ విజయవంతం కావడంతో పార్టీలు కూడా ఇక హిందూ ఎజెండాకు మద్దతు ఇవ్వాల్సిందేనంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: