18 కోట్ల పైచిలుకు వ్యక్తులు ఉన్నా తెలుగు వాళ్ళు దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రభావం తక్కువేనన్న సీఎం రేవంత్ రెడ్డి .. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే రెండో భాష తెలుగు అన్నారు. రాజీవ్ గాంధీ భారత దేశానికి కంప్యూటర్ పరిచయం చేసారని.. వైఎస్ఆర్ తెలుగు వాళ్ళ కోసం మంచి నిర్ణయాలు తీసుకున్నారని.. చంద్రబాబు, వైఎస్ఆర్ ప్రభావం చూపినా.. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ప్రభావం ఇప్పుడు తగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
చట్ట సభల్లో తెలుగు వారు మాట్లాడతారా అని ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి .. సినిమా రంగం లో మన తెలుగు వాళ్ళు హాలీవుడ్ తో పోటీ పడుతున్నారని.. ఇది హర్షించదగిన విషయమని అన్నారు. ఎన్ని భాషలైనా నేర్చుకోండి.. కానీ తెలుగులోనే మాట్లాడండి.. మలయాళీలతో పోటీ పడేలా తెలుగు వాళ్ళు ఎదుగుతున్నారు.. అమెరికా పర్యటనలో తెలుగు వాళ్ళు వచ్చి కలిస్తే చాలా సంతోషం వేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రవాణా సౌకర్యం కోసం భద్రాచలంలో ఎయిర్ పోర్టు తేవాలని.. 362 కిలోమీటర్లతో రీజినల్ రింగురోడ్డు నిర్మిస్తున్నామని.. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పారిశ్రామికీకరణ జరుగుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి ... తెలంగాణ రైసింగ్ అనే నినాదంతో 2050 విజన్ తో పని చేస్తున్నామన్నారు. మీ తెలివిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. ప్రభుత్వం మీకు పూర్తి సహకారం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.