- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


ఏపీ సీఎం చంద్రబాబు క్యాబినెట్ ఏర్పడి ఇప్పటికే ఆరు నెలలు దాటేసింది. క్యాబినెట్లో కొందరు మంత్రుల పనితీరు అద్భుతంగా ఉందన్న టాక్ అయితే బయటకు వచ్చేసింది. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నుంచి కొందరు మంత్రులు పనితీరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. అయితే కొందరు మంత్రుల పనితీరు వీరికి ఏమాత్రం నచ్చటం లేదన్న ప్రచారం కూడా న‌డుస్తోంది. మరి ముఖ్యంగా హోం మంత్రి వంగలపూడి అనిత తో పాటు కోనసీమ జిల్లాకు చెందిన యువ మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరు విషయంలో చంద్రబాబు అంత సంతృప్తిగా లేరని అంటున్నారు. హోం మంత్రి అనిత విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఓపెన్ గానే తన సహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బాబు క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు మాత్రం నిరంతరం క‌సితో పనిచేస్తున్నారు. అసలు ఇటీవల కాలంలో ఇంత కసి ఉన్న రాజకీయ నాయకులను చూడలేదు అని తెలుగుదేశం వర్గాలే చర్చించుకుంటున్నాయి.


ప్రభుత్వంలో ఉత్తమ మంత్రులుగా పేరు రావాలన్న తపనతో వారు మామూలుగా కష్టపడటం లేదు. అటు తమ శాఖలతో పాటు తమ తమ నియోజకవర్గాలలో పార్టీ సభ్యత్వాలు నమోదు విషయంలోనూ వారు దూసుకుపోతున్నారు. ఆ ఇద్దరు మంత్రులు ఎవరో ? కాదు .. నిమ్మల రామానాయుడు - పొంగూరు నారాయణ శాఖల పరంగా అద్భుతమైన పనితీరు కనపరుస్తున్న ఈ ఇద్దరు మంత్రులు తమ నియోజకవర్గాలలో పార్టీ సభ్యత్వాలు నమోదు విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. మంత్రి నారాయణ ప్రాథినిత్యం వహిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 1.49 ల‌క్ష‌లు .. అలాగే నిమ్మల రామానాయుడు ప్రాథమిక వ‌హిస్తున్న పాలకొల్లు నియోజకవర్గంలో ఎప్పటికే ఏకంగా 1.48 ల‌క్ష‌లు సభ్యత్వాలు నమోదు అయ్యాయి. మరి ఫైనల్ గా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయ్యేసరికి ఈ ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో అన్నది కూడా తెలుగుదేశం వర్గాల్లో ఆసక్తికర చర్చ‌గా నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: