- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) . . .


జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో తిరుగులేని ఛాంపియన్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి నిన్ను గద్ది దించే వరకు నిద్రపోను అని శపధం చేసి మరి కూటమి కట్టి పవన్ కళ్యాణ్ - బిజెపి మధ్య సంధి కుదిర్చి మూడు పార్టీలతో కలిసి జగన్ను చిత్తుచిత్తుగా ఓడించి సీఎం పీఠం నుంచి గద్ద దింపారు. అక్కడ వరకు బాగానే ఉంది. అనంతరం ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది.


అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. కూట‌మి ప్ర‌భుత్వం లో జ‌న‌సేన పార్టీకి ముందుగా మూడు కేబినెట్ బెర్త్ లు ద‌క్కాయి. ఈ మూడింట్లో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ ఉప ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆయ‌న‌కు మూడు కీల‌క మైన శాఖ‌లు ద‌క్కాయి. ఇక మ‌రో రెండు బెర్త్ లు కూడా అగ్ర వ‌ర్ణాక‌లు చెందిన వారికే ద‌క్కాయి. కాపు వ‌ర్గానికే చెందిన నిడ‌ద‌వోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ సినిమాటో గ్ర‌ఫీ మంత్రి అయ్యారు. ఇక క‌మ్మ వ‌ర్గానికి చెందిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మ‌నోహ‌ర్ పౌర స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి అయ్యారు.


ఇక ఇప్పుడు జ‌న‌సేన‌కు నాలుగో మంత్రి ప‌ద‌వి వ‌స్తోంది. అది కూడా కాపు వ‌ర్గానికే చెందిన ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబుకు ఇస్తున్నారు. ఇలా జ‌న‌సేన‌కు ద‌క్కిన నాలుగు మంత్రి ప‌ద‌వుల్లో మూడు కాపుల‌కు.. ఒక‌టి క‌మ్మ‌ల‌కు ఇచ్చిన‌ట్ల‌వుతుంది. జ‌న‌సేన మంత్రులు అంటే కాపులు .. క‌మ్మ‌లేనా అన్నీ అగ్ర వ‌ర్ణాల‌కేనా అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పైగా జ‌న‌సేన లో ఇద్ద‌రు ఎంపీలు.. మొద‌టి ఎమ్మెల్సీ హ‌రి ప్ర‌సాద్ కూడా కాపు వ‌ర్గ‌మే. ప‌వ‌న్ ఈ విమ‌ర్శ పోగొట్టు కోవాలంటే వెంట‌నే బీసీ, ఎస్సీల‌కు ఎమ్మెల్సీల తో పాటు ప‌లు నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చేలా చేయాలి. లేక‌పోతే పార్టీ పై అగ్ర వ‌ర్ణ ముద్ర‌.. కాపు ముద్ర ప‌డే ప్ర‌మాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: