- ( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసిపి మొన్నటి ఎన్నికలలో కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. ఇది చరిత్రలోనే కని విని ఎరుగని అతి ఘోర పరాజయం అని చెప్పాలి. వైసీపీ కంచుకోట లో అయిన కడప - కర్నూలు - చిత్తూరు - ప్రకాశం - నెల్లూరు జిల్లాలలో కూడా ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ప్రకాశం జిల్లా అంటేనే వైసీపీ కంచికోట వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీ అక్కడ తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. ఏకంగా రెండుసార్లు జడ్పీ పీఠం కైవసం చేసుకుంది. అలాంటి చోట మొన్నటి ఎన్నికలలో జగన్ పలు మార్పులు చేర్పులు చేశారు. ఏకంగా 11 సీట్ల లో అభ్యర్థులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. దీంతో వైసిపి కేవలం దర్శి - ఎర్రగొండపాలెం సీట్లతో సరిపెట్టుకుంది. ఈ రెండు చోట్ల కూడా వైసీపీ అభ్య‌ర్థులు అతి స్వ‌ల్ప మెజార్టీ ల‌తో మాత్ర‌మే విజ‌యం సాధించారు.


జగన్ చేసిన ప్రయోగాలు అన్నిచోట్ల వికటించాయి ఎన్నికల తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్లు పార్టీ మారిపోయారు. పార్టీ కంచుకోటలో జగన్ రిపేర్లు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒంగోలుకు కొత్త ఇన్చార్జిని నియమించిన జగన్ .. ప‌రుచూరు కు కూడా కొత్త ఇంచార్జిని నియమించారు. పరుచూరు కు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తనియుడు గాదె మధుసూదన్ రెడ్డిని నియమించారు. సంక్రాంతి తర్వాత  కందుకూరు - కనిగిరి - కొండేపి - అద్దంకి లాంటి చోట్ల కూడా భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి జగన్ రిపేర్లు వైసిపిని ఎంతవరకు బతికిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: