కేటీఆర్ ఏసీబీ కేసుపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. తప్పు ఒప్పులు తేల్చేది కోర్టులు.. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరు.. కోర్టులు, వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం కరెక్ట్ కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాకు BRS నాయకులు టార్గెట్ కాదు...మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
కోర్టు తీర్పు తరువాత కేటీఆర్ పెట్టిన పోస్టుపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ మారలేదు..ఆయన రైటర్ మారినట్లుంది.. కొత్త సంవత్సరంలో కేటీఆర్ లో స్పిరిట్ పెరిగింది.. కేసీఆర్ ఏ కేసులో ఉన్నా ...హరీష్ అక్కడ ఉంటారు. రేవంత్ రెడ్డి కి...కాంగ్రెస్ ప్రభుత్వానికి.. కావాలని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదు. ఏది బయట పడినా అందులో ఆ కుటుంబం పాత్ర ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఇప్పటి వరకు వేసిన కేసులు, విచారణ కమిషన్ లు బిఆర్ఎస్ వాళ్లు అడిగితేనే వేశామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాళేశ్వరం, విద్యుత్, ఈ ఫార్ములా పై విచారణ వారే అడిగారని గుర్తు చేశారు. కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా చేసింది ఏమీలేదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి... సిస్టంలో వాళ్ళు తప్పులు చేశారు కాబట్టే అన్ని బయటపడుతున్నాయన్నారు. జైలుకు వెళ్తేనే సిఎం అవుతాను అనుకుంటే కేటీఆర్ కంటే ముందు కవిత ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైర్ వేశారు. ఇవేవీ లాభనష్టాల కోసం జరుగుతున్నవి కాదని.. అరవింద్ కుమార్ నిజాలు చెప్తే అన్ని బయటకు వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.