బీఆర్‌ఎస్‌ పార్టీకి గ్రీన్‌కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని.. అందకే కేటీఆర్ ఫార్ములా రేసుకు ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేటీఆర్‌ అరెస్టు రంగం సిద్దమవుతున్న వేళ రేవంత్ రెడ్డి ఎలక్టోరల్‌ బాండ్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే.. ఈ వ్యూహం ద్వారా రేవంత్‌ రెడ్డి అనవసరంగా కెలుక్కున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. దేశంలో అన్ని పార్టీలు ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని బీఆర్ఎస్ నేతలు బలంగా తెరపైకి తెస్తున్నారు.


నిన్న మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ కూడా ఇదే అంశాన్ని బలంగా చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చినపుడు పొంగులేటి మా పార్టీలోనే ఉన్నారన్న కేటీఆర్.. మెఘా సంస్థకు డబ్బులు ఇచ్చారు.. పనులు ఇచ్చారు.. రాఘవ కన్ స్ట్రక్షన్స్ డబ్బులు ఇస్తే పనులు ఇచ్చారని అనవచ్చా అన్నారు కేటీఆర్. గ్రీన్ కో ద్వారా ఎలక్టోరల్ బాండ్లు అందుకోని పార్టీ ఉందా అని ప్రశ్నించిన కేటీఆర్.. క్విడ్ ప్రోకో అంటున్నారు... ఆయనకు నేను ఏమి ఇచ్చానని ప్రశ్నించారు.


మేఘా కంపెనీ మాతో సహా అన్ని పార్టీలకు బాండ్లు ఇచ్చారు... అది కూడా క్విడ్ ప్రోకోనా...?కొత్తగా మంత్రి పదవి వచ్చిన పొంగులేటి ఆగలేకపోతున్నారు.. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఎవరి భూములు రాయించుకుంటున్నారో అన్నీ బయటకు వస్తాయి.. ఇది ఆరంభం మాత్రమే... నాలుగేళ్లలో ఇంకా చాలా కేసులు వస్తాయి..  ఎదుర్కొంటామన్నారు.


పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది... ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో ఎంతో కొంత చేతులు మారిందని అనుకుంటున్నారు.. ఏదో జరిగినట్లు కాంగ్రెస్ నేతలు హడావుడి చేస్తున్నారు.. రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసు అని తెలిసినా... ఏసీబీ విచారణకు పిలిస్తే వెళ్ళాను.. అక్రమ కేసుపై రాజ్యాంగపరంగా ఉన్న  ప్రతి హక్కును నేను ఉపయోగించుకుంటానన్నారు. విచారణకు వెళ్తే వ్యవస్థ నన్ను ప్రశ్నలు అడిగేందుకే వెనక్కు వెళ్లిందన్న కేటీఆర్.. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తేనే నాకు ఉరిశిక్ష వేసినట్లు సంతోషపడుతున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: