- ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్లో కి నాగ‌బాబు ఎంట్రీ . . ?
- లోకేష్ రూలే ఫాలో అవుతోన్న చంద్ర‌బాబు .. !


- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కొణిదెల ఇంత‌కు ఎప్పుడు ఏపీ కేబినెట్లో కి ఎంట్రీ ఇవ్వ బోతున్నారు ? అన్న‌దే ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి గా మారిన ప్ర‌శ్న‌. నాగ‌బాబు ను కేబినెట్లోకి తీసుకుంటున్న‌ట్టు స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వ‌యంగా క్లారిటీ ఇచ్చేశారు. ఇక నాగ‌బాబు కేబినెట్లో కి ఎంట్రీ ఇచ్చేసి బుగ్గ కారు ఎక్కేసి మంత్రి అవ్వ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది. నాగ‌బాబును ముందుగా ఎమ్మెల్సీ ని చేసా త‌ర్వాత కేబినెట్లోకి తీసుకుంటార‌ని కూడా తెలుస్తోంది.


గ‌తంలో నారా లోకేష్ ను చంద్ర‌బాబు కేబినెట్లో కి తీసుకున్న‌ప్పుడు కూడా చంద్ర‌బాబు ఎలాంటి సూత్రం అయితే పాటించారో ఇప్పుడు నాగ‌బాబు విష‌యం లోనూ అదే రూల్ ఫాలో అవుతారంటున్నారు. అంటే నాగ‌బాబు ను ఎమ్మెల్సీ ని చేసిన త‌ర్వాతే మంత్రిని చేస్తారు. అయితే అమ‌రావ‌తి వ‌ర్గాల్లో మ‌రో టాక్ కూడా ఉంది. నాగ‌బాబు ను కేబినెట్లో కి తీసుకుంటే ఆయ‌నకు కొన్ని శాఖ‌లు ఇవ్వ‌డం మాత్ర‌మే కాదు .. కేబినెట్లో స‌మూల మైన మార్పులు ఉంటాయంటున్నారు. ఇదే విష‌యం ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయ్యింది.


మ‌రి కొంద‌రు మంత్రి శాఖ‌లు కూడా మారిపోతాయ‌ని అంటున్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తోన్న మంత్రుల తో పాటు కోస్తా జిల్లాల‌కు చెందిన ఓ మంత్రి.. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన మంత్రి త్వ శాఖ తో పాటు తాజాగా మీడియా లో హైలెట్ అవుతోన్న మంత్రుల శాఖ‌లు మారుస్తారు అంటూ ప్రచారం అయితే న‌డుస్తోంది. మ‌రి ఇందులో ?  ఎంత వ‌ర‌కు మార్పులు ఉంటాయి .. ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: