చెత్త కేసు ఇదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అంటున్నారు. కేటీఆర్ ప్రజలకు వాస్తవాలు చెబుతూ ప్రభుత్వ ఉద్దేశాన్ని ఎండగట్టారని.. చట్ట పరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలనే కేటీఆర్... హైకోర్టు లో పిటిషన్ వేశారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అంటున్నారు.
హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. మేము రైతుబంధు, మంచి నీరు, సాగునీరు, అన్నీ ఇచ్చి ప్రజలతో కలిసి పండుగ చేసుకుంటే... కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టి సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రజలకు అండగా నిలబడుతున్న నేతలపై కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ నేతల ఆనందం కొన్ని క్షణాలే ఉంటాయని.. మాకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. న్యాయపరంగా ఉన్న అవకాశాలు ఉపయోగించుకుంటూనే... ప్రజాక్షేత్రంలో పోరాడి ప్రజల చేతే శిక్ష వేయిస్తామన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. ఫార్ములా - ఈ కేసులో రేవంత్ రెడ్డి దోషి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. లేనివి సృష్టించి తాబేదార్లయిన అధికారులను అడ్డం పెట్టుకొని చేసే కుట్రలు పని చేయవని.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి, బ్రాండ్ ఇమేజ్ కోసమే కేటీఆర్ ప్రయత్నించారన్న విషయం ప్రజలు అందరికీ తెలుసన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. చట్ట పరంగా ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకుంటామన్నారు. న్యాయవాదులు ఉంటే అభ్యంతరం ఏమిటి.. రాహుల్ గాంధీకి ఒక న్యాయం... కేటీఆర్ కు ఒక న్యాయమా.. సుప్రీంకోర్టుకు మా కంటే ముందే ప్రభుత్వం వెళ్లింది... అంత భయం ఎందుకని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.