భారత దేశంపై అసహనం తో పాటు వ్యతిరేక భావజాలం ఉన్న వారికి సహకరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్న కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఎట్టకేలకు రాజీనామా భారీ మూల్యాన్నే చెల్లించారు   రెండేళ్ల క్రితం భారత్ లో జరిగిన జీ 20 సమ్మిట్ కి కెనడాను సాదరంగా భారత్ ఆహ్వానించింది.  ట్రూడో వచ్చిన విమానం ఇబ్బంది పెడితే భారత్ ప్రత్యేక విమాన సదుపాయం కల్పించాలని చూస్తే కూడా తిరస్కరించారు.


అంతే కాదు తన విమానం బాగు అయ్యేంతవరకూ ఉండి అలాగే వెళ్లారు అని ప్రచారం సాగింది.  ఇక ఆయనతో కోసం ప్రత్యేకంగా చేసిన అతిధి మర్యాదల విషయంలో ఆయన పెద్దగా తీసుకోలేదని ప్రచారం సాగింది. మరి అప్పటికే ఆయనకు భారత్ పట్ల ఎందుకో ఒక అభిప్రాయం పెట్టుకుని భారత్ పర్యటనకు వచ్చారని అంతా అనుకున్నారు.


కెనడాలో ఖలిస్థాన్ అనుకూల శక్తులకు ట్రూడో సహకరిస్తున్నారు అన్న ప్రచారమూ ఉంది. పైగా ఆయన భారత్ మీద చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది.  కెనడాకు అగ్ర రాజ్యం మద్దతు ఉంది.



కెనడాలో ఎక్కువ సంఖ్యలో ఉండే భారత్ లోని ఒక వర్గం మద్దతు కోసం ఆయన ఖలిస్థాన్ అనుకూల వైఖరిని అనుసరించారు. కానీ మొత్తం దేశ ప్రజలకు ఆయన పాలన ఏ మాత్రం నచ్చలేదని సర్వే నివేదికలు వచ్చాయి. ఇక ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే భారీ పరాజయం తప్పదని కూడా ఎన్నికల సర్వేలు తెలియచేశాయి.


ఇక లిబరల్ పార్టీ సైతం అదే అభిప్రాయంతో ఉండడంతో ట్రూడో రాజీనామా చేయక తప్పింది కాదని అంటున్నారు.  ప్రధాని పదవిని మాత్రమే కాదు పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకోవాలని నిర్ణయించుకోవడం నిజంగా ఆయన రాజకీయ కెరీర్ లో అతి పెద్ద ఇబ్బందిగానే అంటున్నారు


ప్రపంచ బంధువుగా భారత్ మారి ఈ రోజుని ఎన్నో దేశాలకు చేరువ అయింది. అతి పెద్ద ఆర్ధిక శక్తిగా అవతరిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న దేశంగా ఉన్న కెనడా అగ్ర రాజ్యం మద్దతు చూసుకుని ఇలా భారత్ మీద విషం చిమ్మే ప్రక్రియని చేపట్టినందుకే ట్రూడో రాజకీయ జీవితం ఇలా ముగిసింది అని అంతర్జాతీయంగా విశ్లెషణలు వినిపిస్తున్నాయి. లాజికల్ గా కాకుండా అసంబద్ధంగా వ్యతిరేకతను ఎవరి మీద అయినా పెంచుకుంటే దానికి జనాల అంగీకారం ఉండబోదు అనడానికి ట్రూడో రాజీనామా నిర్ణయం ఒక ఉదాహరణ అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: