ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు తగ్గుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రధానంగా చైనా, జపాన్, రష్యా లు తీవ్రంగా క్షీణిస్తున్న జననాల రేటును ఎదుర్కొంటున్నాయని అంటున్నారు.దీంతో... ఆయా దేశాల్లో యువకుల సంఖ్య తీవ్రంగా పడిపోవడం, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుందని అంటున్నారు.
దీంతో... పెళ్లిళ్లు చేసుకుని, పిల్లల్ని కనండి అంటూ అక్కడి ప్రభుత్వాలు యువతీయువకులను ప్రోత్సహిస్తున్నాయి. పైగా.. పిల్లలకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు రకరకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ సమయంలో రష్యాలోని కరేలియా యాంత్రాంగం ఓ ఆసక్తికర ఆఫర్ ను తెరపైకి తెచ్చింది. ఇది ప్రత్యేకంగా పాతికేళ్ల లోపు యువతులకు అని ప్రకటించింది.
చైనా, జపాన్ లతో పాటు క్షీణిస్తున్న జననాల రేటును పెంచడానికి రష్యా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో జననాల రేటును పెంచే క్రమంలో యువతులను ప్రోత్సహించే ప్రాత్నంలో రష్యాలోని కరేలియా యంత్రంగాం ఓ ఆసక్తికర ఆఫర్ తెరపైకి తెచ్చింది. ఇది పాతికేళ్ల లోపు యువతులకు మాత్రమే అని వెల్లడించింది.
ఇందులో భాగంగా.. ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిచ్చే మహిళలకు 1,00,000 రూబిళ్లు (సుమారు రూ.81,000) ప్రోత్సాహాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే.. ఈ అర్హత పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా స్థానిక కాలేజీ, లేదా యూనివర్శిటీ రెగ్యులర్ విద్యార్థులు అయ్యి ఉండటంతో పాటు 25 ఏళ్ల లోపు ఉన్న కరేలియా నివాసితులు అయ్యి ఉండాలని కండిషన్ పెట్టింది.
అయితే... ఆకస్మిక శిశు మరణ సిండ్రోం కారణంగా బిడ్డ చనిపోతే ఈ చెల్లింపూ రద్దు చేయబడుతుందా లేదా అనేది అస్పష్టంగా ఉండటంతో పాటు.. వైకల్యం ఉన్న పిల్లలకు జన్మనిచ్చినా ఈ చెల్లింపులకు అర్హులా, అనర్హులా అనే విషయంలోనూ స్పష్టత కరువైందని అంటున్నారు. కాకపోతే... చనిపోయిన బిడ్డకు జన్మనిస్తే మాత్రం బోనస్ లభించదని చట్టంలో స్పష్టంగా పేర్కొందని తెలుస్తోంది.
ఇదే సమయంలో... రష్యాలోని ఇతర ప్రాంతాలు కూడా పిల్లలను కనేందుకు యువతులను ప్రోత్సహించే పనిలో ఉన్నాయని అంటుననరు. ఇందులో భాగంగా.. సెంట్రల్ రష్యాలోని టాంక్స్ నగరంలో కూడా ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమం అమలులో ఉంది. ఈ విధంగా రష్యాలోని సుమారు 11 ప్రాంతీయ ప్రభుత్వాలు ఈ రకమైన ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెబుతున్నారు.