ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి 7,8 నెలలు అవుతోంది. చంద్రబాబు సర్కారు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. సిక్స్ గ్యారంటీస్‌ అంటూ చంద్రబాబు ఊరించారు. అయితే అధికారంలోకి వచ్చాక ఒక్క పెన్షన్‌ పెంపు తప్ప ఇతర హామీలు ఇంకా ఏమీ అమలు కాలేదు. అయితే.. ఇంకా చంద్రబాబు ప్రభుత్వానికి దాదాపు నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉండే అవకాశం ఉంది. అయితే.. ఇప్పుడు ఓ విషయం సంచలనంగా మారింది. అదేంటంటే.. రెండు నెలల్లో చంద్రబాబు సర్కారు కూలిపోతోందట.


ఈ మాట ఎవరో అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏకంగా విపక్ష నేత జగన్ నోట ఈ మాట వచ్చింది. అది కూడా ఓ పోలీసు అధికారికి వార్నింగ్ ఇచ్చే సమయంలో జగన్ ఈ మాటలు అన్నారు. ఇంతకీ అసలేంజరిగిందంటే.. పులివెందుల డీఎస్పీని జగన్‌ బెదిరింపులు గురి చేశాడని ఎల్లో మీడియా రాసుకొచ్చింది. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ బెదిరింపులకు దిగారని రాసింది. ఈ ప్రభుత్వం రెండు లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చు.. ఆ తర్వాత మీ కథ ఉంటుందని జగన్ హెచ్చరించారట.


జగన్‌ సమీప బంధువు వైఎస్‌ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలు కడప జిల్లా పులివెందులలో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. జగన్‌ తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్‌కు చేరుకున్న సమయంలో వివిధ విచారణల్లో భాగంగా డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నారని జగన్‌కు వైసీపీ నేతలు కంప్లయింట్ చేశారు. దీంతో హెలిప్యాడ్‌ వద్ద ఆగిన జగన్‌ డీఎస్పీని పిలిపించారట. దీంతో డీఎస్పీ మరో ఇద్దరు సీఐలతో జగన్‌ వద్దకు వెళ్లారట. ఆయన్ను ఉద్దేశించి జగన్‌ తీవ్ర స్వరంతో మాట్లాడారట.


జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ హెచ్చరించారట. ఈ ప్రభుత్వం రెండు లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చు.. ఆ తర్వాత మీ కథ ఉంటుందని గట్టిగా అన్నారట.  మరి జగన్ అంత గట్టిగా ప్రభుత్వం కూలిపోతుందని అన్నారంటే.. ఏ ఆధారం లేకుండా అని ఉంటారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ ధైర్యం ఏంటన్నది మాత్రం అర్థం కావట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: