రోజా గతం విప్పితే చాలా దారుణంగా ఉంటుందన్న టీడీపీ నేత జేసి ప్రభాకర్ రెడ్డి.. అవన్నీ తమతో చెప్పించుకునే అవసరం తెచ్చుకోవద్దని సూచించారు. రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. తిరుమల టోకెన్లను కూడా స్వార్థానికి వాడుకున్నారని టీడీపీ నేత జేసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. అలాంటి రోజా ఇప్పుడు తిరుమలలో తొక్కిసలాట గురించి మాట్లాడే అర్హత లేదని జేసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎక్కడ వ్యక్తులు చనిపోయిన వైసీపీ వారు రాబంధుల్లా వస్తున్నారన్న జేసి ప్రభాకర్ రెడ్డి.. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. గత వైసీపీలో అనేక మంది ప్రమాదాల్లో చనిపోయారని.. బోటు ప్రమాదం 33 మంది, అన్నమయ్య ప్రాజెక్టు ఘటనలో 33 మంది.. ఇలా అనేక ప్రమాదాలు జరిగాయని జేసి ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు.
గతంలో గుడికి వెళ్లాలన్నా కూడా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేశారని జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమను అనేక ఇబ్బందులు పెట్టారని జేసి ప్రభాకర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. వైసీపీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని అనేక అరాచకాలు చేశారన్న జేసి ప్రభాకర్ రెడ్డి.. గతంలో పోలీసులను.. ఇప్పుడు పోలీసులను చూస్తే బాధేస్తుందన్నారు. తిరుపతి ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకున్నారని జేసి ప్రభాకర్ రెడ్డి వివరించారు. దేశంలో రాబందులు లేవు.. వైసీపీ వారే రాబంధుల్లా తయారు అయ్యారని జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు.