సంక్రాంతి సందర్భంగా  చంద్రబాబు సర్కారు కొన్ని వరాలు ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, విద్యార్ధులు, రైతుల్లో సంతోషం నింపేందుకు ప్రభుత్వం సంక్రాంతి వరాలు ప్రకటించింది. ఈ విషయాన్ని విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు.


ఇంతకీ చంద్రబాబు సర్కారు ప్రకటించిన వరాలు ఏంటంటే.. పలు రకాలుగా గత ఐదేళ్లుగా ఉన్న రూ. 6.750కోట్లు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తున్నారు. ఇది నిజంగా లబ్ధిదారులకు సంక్రాంతి వరమే అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్, సీపీఎఫ్, టీడీఎస్ కు సంబంధించి రూ.1300కోట్లు విడుదల చేయబోతున్నారు. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్ మెంట్, పోస్టుమెట్రిక్ ఉపకారవేతన బకాయిలు కలపి 788కోట్లు సీఎం విడుదల చేశారు.


ఇవే కాకుండా చిన్న కాంట్రాక్టర్లకు రూ. 586కోట్లు బకాయిలు ఇచ్చేశారు. ఇలా ఇవ్వటంతో 20వేల మందికి ప్రయోజనం చేకూరిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. బకాయిల విడుదలతో ఆయా వర్గాల కుటంబాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కల్పించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇలా., 7నెలల పాలనలో సంక్షేమంతో పాటూ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.


జిల్లాలో పల్లె పండుగ పేరుతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రహదారుల మరమ్మతులు, నిర్మాణానికి ప్రాధాన్యత కల్పించామన్నారు. యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బయోటెక్నాలీజి, ఎలక్రికల్ వాహన పరిశ్రమలు ఉత్తరాంధ్రలో నెలకొల్పేందుకూ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు.
పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అయితే చంద్రబాబు సర్కారు ప్రకటించిన వరాల్లో సామాన్య జనాలకు పనికొచ్చే వరాలు మాత్రం కనిపించలేదంటున్నారు సాధారణ జనం. అదీ నిజమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: