రెండేళ్ల కాలపరిమితితో ఆమె నియామకాన్ని ఖరారు చేస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం నెలకు 5 లక్షల చొప్పున చెల్లించే ప్రాతిపదికన అమెను సలహాదారుగా నియమిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణతో పాటు గ్లోబల్ స్థాయిలో ప్లేస్ మెంట్ల సాధించేలా చూడాలని నియామక ఉత్తర్వుల్లో చంద్రబాబు సర్కారు పేర్కొంది. సలహాదారుగా పని తీరు కొలమానం కోసం కొన్ని ఇండికేటర్లను పెడుతూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది.
జపాన్ , కెనడా, జర్మనీ లాంటి చోట్ల కనీసంగా ఏడాది 1 లక్ష మంది వర్కర్లకు ఉపాధి దొరికేలా అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి నిపుణురాలు సీతా శర్మ చూడాలని నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. కనీసం 5 లక్షల మంది వర్కర్లకు అంతర్జాతీయస్థాయిలో శిక్షణా ధృవీకరణ పత్రాలు ఇచ్చేలా చూడాలని అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి నిపుణురాలు సీతా శర్మకు ప్రభుత్వం సూచించింది. అంతే కాదు.. వేర్వేరు సంస్థలతో ఒప్పందాలను కుదిర్చేలా చూడాలని అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి నిపుణురాలు సీతా శర్మకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇంకా ఐటీ , నిర్మాణ రంగం, ఆరోగ్య రంగం లాంటి వాటిల్లో ఎక్కువ వేతనాలతో కూడిన ఉద్యోగాల కోసం అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి నిపుణురాలు సీతా శర్మ కృషి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యా, వైద్య రంగాల్లో 40 శాతం మంది మహిళలకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడాలని పేర్కొన్న ప్రభుత్వం.. అదే సమయంలో విదేశాల్లో ఉద్యోగఅవకాశాలు దొరికిన వారిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా డిజిటల్ రికార్డులు ఉండాలని స్పష్టం చేసింది.