కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీటుకు ఎసరు వస్తోందా అనే ప్రచారం జరుగుతోంది.  రాజకీయాల్లో పదవులు ఎంత తొందరగా వస్తాయో పోవడం కూడా అలాగే ఉంటుంది.  కాంగ్రెస్ పార్టీలో సీఎంల సీటు చాలా ఈజీగా పోతుంటుంది అన్నది తెలిసిందే.  కర్ణాటకలో సీటు కోసం గతంలోనే పోటీ జరిగింది. ఎన్నో తర్జన భర్జనల తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా నెగ్గారు.  పదవికి గట్టి పోటీదారుగా నిలిచిన కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ని ఉప ముఖ్యమంత్రిగా చేశారు.  రెండేళ్ళ తరువాత ఆయనకు సీఎం సీటు ఇస్తారని ఆనాడు ఒప్పందం జరిగిందని ప్రచారంలోకి వచ్చింది.


ఆ గడువు చూస్తే ఇపుడు దగ్గరకు వచ్చేసింది. దాంతో కర్ణాటక సీఎం గా ఉన్న సిద్ధరామయ్య పదవికి గండం ఉందని అంటున్నారు.  మరో వైపు చూస్తే సిద్ధరామయ్య మంత్రులతో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూండడం భేటీలు వేయడంతో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.  సీఎం విషయంలో డీకే శివకుమార్ ఏమీ తొందర పడటం లేదని ఆయన వర్గీయులు అనుచరులు చెబుతున్నారు.  ఆయనకు పదవి న్యాయంగా రావాలసిన టైం లో వస్తుందని అంటున్నారు.



సిద్ధరామయ్య పాలన చూస్తే అనుకున్నంతగా లేదని అంటున్నారు. కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు దక్కుంచుకుంది. బలపడింది. ఇంకో వైపు ముడా కుంభ కోణం విషయంలో సీఎం సిద్దరామయ్య ఇబ్బంది పడుతున్నారు.   ఈ నేపథ్యంలో కూడా సిద్ధరామయ్య సీఎం సీటు మీద అనుమానాలు ముసురుకుంటున్నాయని అంటున్నారు. మరో వైపు మూడేళ్ళ కాలపరిమితితో డీకే శివ కుమార్ కి కర్ణాటక బాధ్యతలు అప్పగిస్తే ఆయన మళ్లీ పార్టీని ఒక గాటిన పెడతారు అని కాంగ్రెస్ అధినాయకత్వం ఆశిస్తోందని కూడా చర్చ సాగుతోంది.


ఇవన్నీ చూస్తూంటే సిద్ధరామయ్య మార్చి తరువాత తప్పుకుంటారని అంటున్నారు. మార్చి నెలలో బడ్జెట్ సెషన్ ఉంటుంది. అప్పటివరకూ ఆయన సీఎం గా ఉంటారని ఆ తరువాత డీకే ఆ సీటులోకి వస్తారని అంటున్నారు. మరో వైపు చూస్తే సీఎం సీటు విషయంలో మార్పుల గురించి ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దు అని కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: