తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ టాస్క్ అప్పగించింది. దావోస్ టూర్ నుంచి వస్తూనే రేవంత్ ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఢిల్లీలో ప్రచారం కోసం రేవంత్ ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఎంపిక చేసింది. మొత్తం 40 మందితో జాబితా విడుద ల చేసింది.
తాజాగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన రెండు కీలక హామీలను రేవంత్ పీసీసీ చీఫ్ తో కలిసి ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో, గ్యారంటీల ప్రచార బాధ్యతలను రేవంత్ కు అప్పగించారు. ఢిల్లీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆప్ తో పొత్తు లేకపోయినా అక్కడ గెలుపు పైన నమ్మకం పెట్టుకుంది. ఆప్ పైన ప్రజా వ్యతిరేకత ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక, బీజేపీ సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు ఓటర్లకు తమ హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలు ప్రకటించాయి. కాగా, కాంగ్రెస్ అయిదు ప్రధాన గ్యారంటీలనే ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పీసీసీ చీఫ్ తో కలిసి తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ 500 కే గ్యాస్ సిలిండ ర్ ఇస్తామని.. పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే బాధ్యత తదనేనని హామీ ఇచ్చారు.
తెలంగాణలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తున్నామని రేవంత్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏపీ- తెలంగాణకు చెందిన పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి నియమిస్తోంది. తాజాగా పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంకతో సహా మొత్తం 40 మంది వరకు ఉన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ ను స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది. ఇక, ఇప్పుడు ఢిల్లీలో గ్యారంటీల గురించి ప్రచారం చేయటంతో పాటుగా పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం పని చేయాలని రాహుల్ నిర్దేశించారు. దీంతో, ఇప్పుడు ఢిల్లీ వేదికగా రేవంత్ పార్టీ కోసం ప్రచారం చేయనున్నారు.