ఏపీలో ఎన్డీయే కూటమి కట్టినప్పుడల్ల ఘన విజయమే దక్కుతూ వస్తోంది.  2018 ఎన్నికల తరువాత టీడీపీ తెలంగాణా పట్ల రాజకీయ ఆసక్తిని తగ్గించేసింది. 2023 ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలసి అక్కడ పోటీ చేసింది.  2024లో ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారం దక్కడంతో చంద్రబాబు తెలంగాణాలో పార్టీ విస్తరణ గురించి ఆలోచన చేస్తున్నారు.  


ఏపీకి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబు నివాసంలో విందారగించారు.  ఈ క్రమంలోనే అమిత్ షా తెలంగాణాలో సైతం ఎన్డీయే కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారని తెలుస్తొంది. దానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ అంగీకరించినట్లుగా చెబుతున్నారు.  ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో మూడో ప్లేస్ లో ఉంది. దానికి 2028 అధికారం ముఖ్యంగా ఉంది.  దాంతో అనేక రకాలైన రాజకీయ ఎత్తుగడలను వేస్తోంది.


తెలంగాణాలో టీడీపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది.   పవన్ కళ్యాణ్ కి కూడా తెలంగాణాలో అపారమైన అభిమాన జనం ఉన్నారు.  ఆయన సామాజిక వర్గం కూడా గట్టిగా ఉంది.  దాంతో ఈ మూడు పార్టీలు జత కడితే తప్పకుండా కాంగ్రెస్ బీఆర్ ఎస్ లను ధీటుగా ఎదుర్కొని అధికారం అందుకోగలమన్న నమ్మకం అయితే బీజేపీ పెద్దలతో కనిపిస్తోంది అని అంటున్నారు.


తెలంగాణాలో ఉన్న స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నాయని అంటున్నారు.  బీజేపీలోని తెలంగాణా నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, బీఆర్ఎస్ ఆంధ్రా వాదాన్ని ఏ విధంగా వినిపిస్తుంది అన్నవి కూడా ఈ మినీ అసెంబ్లీ ఎన్నికల్లో తేలుతుంది అని అంటున్నారు.


లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి ఆ మీదట మంచి ఫలితాలు అందుకుంటే కనుక దానిని కంటిన్యూ చేస్తూ 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి కొనసాగిస్తారు అని అంటున్నారు.   చంద్రబాబు పవన్ బలానికి తోడు బీజేపీ వ్యూహాలు అమిత్ షా మోడీ చరిష్మా తోడు అయితే కచ్చితంగా గెలుపు సాధిస్తారు అని అంటున్నారు.  ఈ విషయాల మీద పూర్తి రాజకీయ అవగాహన ఉండబట్టే అమిత్ షా ఈ విధంగా ప్రతిపాదన చేశారు అని అంటున్నారు.  మొత్తానికి ఏపీకి అమిత్ షా రావడం ద్వారా ఎన్డీయే కొత్త బంధానికి బాటలు వేశారని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: