బీజేపీకి ఇపుడు కళ్ల ముందు ఉన్న భారీ లక్ష్యం ఢిల్లీ ఎన్నికలు.  మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు 8న వెలువడనున్నాయి.  బీజేపీ చివరిసారి 1993లో గెలిచింది. అంటే మూడు దశాబ్దాలకు పైగా ఢిల్లీలో గెలుపు రుచిని బీజేపీ ఆస్వాదించలేదు అన్న మాట.  2013 నుంచి ఆప్‌ అప్రతిహతంగా గెలుస్తూ వస్తోంది. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించారు. ఈసారి కూడా ఆయన గెలిస్తే ఐదవసారి పీఠం ఎక్కి రికర్డు క్రియేట్ చేయనున్నారు.


గతంలో ఉన్న ఇమేజ్ అయితే ఈసారి అరవింద్ కి లేదని అంటున్నారు.  గ్రౌండ్ లెవెల్ లో చూస్తే మార్పు కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో మాదిరిగా ఆప్ లో ఐక్యత లేదు. సీనియర్లు కూడా కొందరు దూరంగా ఉన్నారు. పార్టీలో వర్గ పోరు సాగుతోంది.  ఇవన్నీ తట్టుకుని కేజ్రీవాల్ ఒంటి చేత్తొ పోరాడి గెలిస్తే మాత్రం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో మైలు రాయిని దాటినట్లే అంటున్నారు. కేజ్రీవాల్ ఇమేజ్ తగ్గడం ఆప్ మునుపటిలా లేకపోవడం ప్రజలలో మార్పు కోసం తపించడం వంటివి తమకు కలసి వస్తాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది.


ఢిల్లీలో ఈసారి ట్రయాంగిల్ ఫైటింగ్ అని చెప్పాలి. కాంగ్రెస్ ఆప్ తో ఢీకొడుతోంది.  కాంగ్రెస్ ఢిల్లీని 1998 నుంచి 2013 దాకా అంటే ఏకంగా పదిహేనేళ్ళ పాటు పాలించింది.  దాంతో కాంగ్రెస్ కి కూడా కొన్ని సెగ్మెంట్లలో బలం ఉంది.  ఓటు బ్యాంక్ కూడా ఉంది. ఈ త్రిముఖ పోటీ వల్ల ఆప్ ఓట్లు చీలిపోయి తమకు విజయావకాశాలు బాగా పెరుగుతాయని బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు.  బీజేపీ అనుకున్నట్లుగా ఢిల్లీలో గెలిస్తే అసలైన గేమ్ స్టార్ట్ చేస్తుంది అని అంటున్నారు.


జమిలి, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఆమోదించడంతో పాటు రాజకీయంగా దూకుడు పెంచుతుందని అంటున్నారు.  అక్టోబర్ లో జరిగే బీహార్ ఎన్నికల్లోనూ మరోమారు సక్సెస్ కొట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుందని 2026లో జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తుందని విపక్షాల వ్యూహాలకు అందనంత విధంగా పకడ్బందీ వ్యూహంతో వారిని చక్రబంధం చేస్తుందని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

bjp