రాజకీయ మేధావిగా చంద్రబాబుని చెబుతారు. ఆయనలో అపర చాణక్యుడు  మరో మారు తన పదును ఏంటో చూపించారు.  నారా లోకేష్ నే రేపటి వారసుడు అని చాటి చెప్పేలా భారీ ప్లాన్ వేశారు అని అంటున్నారు.  కూటమిలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.  ఉగాది తరువాత మంచి ముహూర్తం చూసి లోకేష్ ని రెండో ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నియమించనున్నారనే ప్రచారం నడుస్తోంది.


జనసేనకు ఒక గిఫ్ట్ గా నాగబాబుని మంత్రిని చేయనున్నారు.  దాంతో జనసేన కూడా ఏమీ అనలేని పరిస్థితి అని అంటున్నారు.  నిజానికి నాగబాబును మంత్రిగా తీసుకోవడం వెనక పవన్ ఆలోచనలు ఉన్నాయా లేక చంద్రబాబు వ్యూహాలు ఉన్నాయా అంటే ఇపుడే దాని మీద కొంత విశ్లేషణ జరుగుతోంది.


నాగబాబు మంత్రిగా చేయడం అంటే పవన్ కూడా బంధు ప్రీతికి తలొగ్గారు అని కామెంట్స్ వచ్చే చాన్స్ ఉంది.  టీడీపీ విషయానికి వస్తే కొత్తగా వచ్చేది ఏదీ లేదు. ఆ పార్టీలో వారసత్వ పోకడలు సహజం.  వారసత్వం విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎపుడూ అది తప్పు అని మాట్లాడింది కూడా లేదు. కానీ జనసేన అధినేత అలా కాదు అవినీతి వారసత్వ రాజకీయాలు అంటూ తన ఫిలాసఫీ వల్లిస్తూ వచ్చారు. ఇపుడు సడెన్ గా నాగబాబుకు మంత్రి అంటే పవన్ ఈ విమర్శలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది.  



తండ్రీ కొడుకులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగానా అని అసలు జనసేన నేతలు అనలేరని అంటున్నారు.  అదే కేబినెట్ లో తమ్ముడు డిప్యూటీ సీఎం నాగబాబు మంత్రిగా ఒప్పు అయినపుడు ఇది తప్పు ఎలా అవుతుంది  అన్నది వెంటనే చర్చగా వస్తుంది.  ఏ విధంగా చూసినా జనసేన స్మూత్ గానే ఈ విషయంలో ఉండాల్సి ఉంటుంది.


కాగల కార్యం గంధర్వులు తీర్చుతన్నారు అన్నట్లుగా నాగబాబుకు మంత్రి పదవితో పాటే లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కుతుంది. దీని వల్ల కేబినెట్ లో జనసేన ప్రాధాన్యత పెరగకుండా లోకేష్ కి ప్రమోషన్ ఇచ్చి పైకి లేపినట్లు అవుతుంది.  అంతే కాదు ఉప ముఖ్యమంత్రి ఒకరు కాదు ఇద్దరు అన్నపుడు ఆటోమేటిక్ గా లోకేష్ కూడా హైలెట్ అవుతారు అని అంటున్నారు.  టోటల్ గా చూస్తే భారీ స్కెచ్ తోనే టీడీపీ అధినాయకత్వం లోకేష్ కి డిప్యూటీ సీఎం సీటుని రెడీ చేసి పెడుతోంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: