తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పార్టీ హయాంలో జరిగిన ఒప్పందాలు, వాటిలో జరిగిన అక్రమాలు, నాసిరకం నిర్మాణాలు, ఫోన్‌ ట్యాపింగ్‌వంటి వ్యవహారాలపై విచారణ జరుగుతోంది.  ఫార్ములా ఈ రేస్‌ కేసులో విదేశీ సంస్థకు రూ.56 కోట్లు కేటాయించడంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గొర్రెల పంపిణీ పథకంలోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.  ఫార్ములా ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ ఏ1గా ఉన్నారు. ఆయనను ఏసీబీతోపాటు ఈడీ కూడా విచారణ చేశాయి.


ఫార్ములా ఈ రేస్‌కేసులో ఈడీ విచారణకు వెళ్లిన కేటీఆర్‌ బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డికి ఓ కీలక సూచన చేశారు.  తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా ధైర్యంగా ఎదుర్కొంటానని ప్రకటించారు.  కేసుల పరిష్కారానికి ఇద్దరం జడ్జి ముందు కూర్చుందామని, ఇద్దరికీ లైడిటెక్టర్‌ పరీక్ష చేయించుకుందామని తెలిపారు. దీంతో నిర్దోషి ఎవరో దోషి ఎవరోతేలిపోతుందని స్పష్టం చేశారు.  ఫార్ములా ఈ రేస్‌పై తనపై పెట్టిన కేసు విచారణ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అంతా వృథాయే అని విమర్శించారు.  కోట్లు పెట్టి దర్యాప్తు చేయించడం కన్నా.. లై డిటెక్టర్‌ పరీక్ష చేయించుకుందామని, మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసి తప్పు ఎవరిదో తేల్చుకుందామని సవాల్‌ చేశారు.


కేటీఆర్‌ చేసిన ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దేశంలో చట్టాలు చాలా స్లోగా ఉన్నాయని, విచారణ ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో కేటీఆర్‌ ఐడియా బాగుందని చాలా మంది అభిప్య్రాపడుతున్నారు. ఇలా నేతలందరూ లై డిటెక్టర్‌ పరీక్షలు చేయించుకుంటే రెండు మూడు రోజుల్లోనే చాలా కేసులు పరిష్కారం అవుతాయని పేర్కొంటున్నారు.


కేటీఆర్‌ ఐడియా బాగానే ఉన్నా.. ఎవరి కేసు వారిది. లై డిటెక్టర్‌ పరీక్షలకు మన చట్టాలు అంగీకరించవు. చట్టం, రాజ్యాంగం ప్రకారం.. దర్యాప్తులు జరుగుతాయి. అయినా ఇక్కడ కేసులు ఉన్నది రేవంత్‌ తప్పు చేశాడా.. లేక కేటీఆర్‌ తప్పు చేశాడా అని కాదు.. ఎవరి కేసులు వారివే. ఈ లాజిక్‌ తెలియకుండానే కేటీఆర్‌ సంచలనం కోసం ఓ ప్రకటన చేశాడు. ఈడీ కేసులు రేవంత్‌ పెట్టిస్తున్నాడని, ఆయనే దర్యాప్తు చేయిస్తున్నాడని కేటీఆర్‌ భావిస్తే ఆయనకు పెద్ద ఎలివేషన్‌ ఇచ్చినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr