ఇది వాస్తవానికి అధికారిక భేటీ కాదు. అనధికార భేటీ. కేంద్ర మంత్రి.. కేవలం డిజాస్టర్ భవనాన్ని ప్రారం భించేందుకు మాత్రమే వచ్చారు. కానీ, ఈ సందర్భంగా ఆయన సీఎం, డిప్యూటీ సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఏపీలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ఇలా ముగ్గురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటీలో ప్రధానం గా.. రాజకీయ పరమైన అంశాలకంటే కూడా.. అభివృద్ది అజెండాపైనే చర్చించినట్టు తెలిసింది.
సహజంగా అమిత్ షా ఎక్కడకు వెళ్లినా.. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాలు పాలిస్తున్న చోటకు వెళ్తే.. అక్క డి రాజకీయ వాతావరణాలపై కంటే కూడా.. అభివృద్ధిని ప్రాతిపదికగా చేసుకుని షా మాట్లాడతారు. కానీ, ఏపీ విషయంలో మాత్రం కొంతమేరకు రాజకీయాలు మాట్లాడారని తెలిసింది. అయితే.. దీనిపై కూడా.. ఎవరి కోణంలో వారు విశ్లేషణలు చేసుకుంటున్నారు. కొందరు వైసీపీ అధినేత జగన్ గురించి షా ప్రస్తావించారని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు అసలు ఆయన ప్రయోజనం బీజేపీకి పెద్దగా లేదని అంటున్నారు.
ఇంతకన్నా.. బీజేపీకి కావాల్సినవి చాలానే ఉన్నాయని కూడా చెబుతున్నారు. సో.. అమిత్‌షా-బాబు-పవన్ భేటీలో వీటినిమించిన అంశాలపై చర్చ సాగి ఉంటుందని అంటున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు, జమిలి ఎన్నికల బిల్లు, రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాలు వంటి అంశాలను ప్రస్తావించినట్టు తెలిసింది. అంతకుమించి అమిత్ షా.. ఇతరుల విషయాన్ని ప్రస్తావించే అవకాశం లేదని.. ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అయితే.. ఈ భేటీకి అంతప్రాధాన్యం ఎందుకంటే.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. విశాఖ ఉక్కుకు, పోలవారిని, రాజధానిని నిధులు కేటాయించడమే కారణమని అంటున్నారు.