గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ కి గాజు గ్లాస్ గుర్తు ని ఫ్రీ సింబల్ గా ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి తెలిసిందే.   ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఒక పార్టీ కి 7 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచిన్నప్పుడే పార్టీ గుర్తుని శాశ్వతం చేస్తారు.  జనసేన పార్టీ కి 2019 ఎన్నికలలో దాదాపుగా 6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.  దీంతో గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ గా ప్రకటించింది ఎన్నికల సంఘం.  


2024  సార్వత్రిక ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తు మీద ఎంతో మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు.   దీని వల్ల జనసేన పార్టీ కి 50 వేలకు పైగా ఓట్లు మిస్ అయ్యాయి.  ఇంత క్లిష్టమైన పరిస్థితి లో కూడా ఆ పార్టీ కి వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందంటే మామూలు విషయం కాదు.  8 శాతం కి పైగా ఓటింగ్ రావడం తో గాజు గ్లాస్ గుర్తు ని జనసేన పార్టీ కి శాశ్వతం చేస్తూ ఎన్నికల సంఘం పవన్ కళ్యాణ్ కి ఉత్తర్వులు జారీ చేసింది.   దీంతో జనసేన పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  ఇది సాధారణమైన విజయం కాదని, క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ క్యాడర్ పడిన కష్టానికి దక్కిన ఫలితమని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఇక నుంచి గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీ కి తప్ప, ఎవరికీ చెందినది కాదు అనే వార్తనే మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.  మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.  ఈసారి గుర్తింపు పొందిన పార్టీ గా జనసేన ఈ దినోత్సవం ని ఘనంగా జరుపుకోబోతుంది. అంతే కాదు ఇప్పటి వరకు ఈ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వాలు 12 లక్షలకు పైగా దాటింది. త్వరలోనే మెంబెర్ షిప్ డ్రైవ్ ని మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ఈసారి ఏకంగా 20 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.  


ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాబట్టి కచ్చితంగా ఈసారి సభ్యత్వాలు రికార్డు స్థాయిలో ఉండనుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా ఎంతటి ఉన్నత స్థాయికి ఎదగబోతుంది అనేది.


మరింత సమాచారం తెలుసుకోండి: