ఈ లిస్టు లో ప్రపంచంలో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న టాప్ 200 కంపెనీల జాబితా ను హురున్ విడుదల చేసింది .. అందులో కనీసం 8600 కోట్లు మార్కెట్ విలువ ఉన్న కంపెనీలను నివేదిక పరిగణలోకి తీసుకుంది .. ఈ విధంగా ఈ కంపెనీలో మార్కెట్ విలువ మొత్తం కలిపితే 10 లక్షల కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది . అలాగే ఈ 200 సంస్థల కు 226 మంది సీఈవోలు , ఎండీలు , వ్యవస్థాపకులు ఉన్నారు .. వీరంతా భారతదేశం వెలుపల ఉన్న భారతీయ సంతతి వ్యక్తులే .. ఈ లిస్టులో టాప్ 10 లో నిలిచిన ప్రముఖుల వివరాలు చూస్తే.
పేరు - సంస్థ :
సత్య నాదెళ్ల : మైక్రోసాఫ్ట్
సుందర్ పిచాయ్ : ఆల్ఫాబెట్
నీల్ మోహన్ : యూట్యూబ్
థామస్ కురియన్ : గూగుల్ క్లౌడ్
శంతను నారాయణ్ : అడోబ్
సంజీవ్ లాంబా : లిండే
వసంత నరసింహన్ : నొవార్టిస్
అరవింద్ క్రిష్ణ : ఐబీఎమ్
విమల్ కపూర్ : హనీవెల్
కెవిన్ లోబో : స్టైకర్
ఇలా టాప్ 10లో తెలుగు ప్రాంతాలకు చెందిన వారు మొత్తం ముగ్గురు ఉండగా .. వారిలో సత్య నాదెళ్ల .. అరవింద్ క్రిష్ణ ఏపీకి చెందిన వారు కాగా.. శంతను నారాయణ్ తెలంగాణ కు చెందిన వారిగా పేర్కొన్నారు .