నిన్న మొన్నటివరకు ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నుంచి భారీ సంఖ్యలో నాయకులు వస్తున్నారని.. 11మంది ఎమ్మెల్యేలు కాదు.. వైసీపీలో ఒక జగన్ మాత్రమే మిగులుతాడు అంటూ కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా మన వైసీపీ నాయకులు ఎవరూ కూడా కూటమీ పార్టీల వైపు చూడటం లేదు. కచ్చితంగా పార్టీ మారుతారు అనుకున్న ఎమ్మెల్యేలు కూడా మౌనంగా ఉన్నారు. ఇక పాత నాయకుడు పార్టీకి రాజీనామా చేసిన వారు కూడా మౌనంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే జంపింగ్లు ఆగాయా.. లేక ఎవరైనా ఆపారా.. అనే సరికొత్త చర్చ ఏపీ రాజకీయ వర్గాలలో తెరమీదకు వచ్చింది.


ప్రస్తుతం జంపింగ్‌లు ఆపారనే అంటున్నారు. కూటమి నాయకులు విశాఖలో అడారి ఆనంద్ కుమార్ విషయంలో జరిగిన పొరపాటు నేపథ్యంలో.. జంపింగ్ విషయంలో కూటమి పార్టీల నాయకులు.. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారని తెలిసింది. ఎవరు పార్టీలలోకి వచ్చిన కూటమి పార్టీల నాయకులు కలిసి కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకున్నాక.. చంద్రబాబు సూచనల నేపథ్యంలోనే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి జంపింగ్ ఆగినట్టు సమాచారం. అప్పట్లో ఆనంద్ కుమార్‌ను బిజెపి నేతలు హడావుడిగా చేర్చుకున్నారు. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.


అలాగే కైకలూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను జనసేనలో చేర్చుకున్నారు. ఇది కూడా టీడీపీ ఆగ్రహానికి కారణం అయ్యింది. అలాగే మంగళగిరిలో లోకేష్ పై సవాల్ చేసిన గంజి చిరంజీవిని కూడా జనసేనలో చేర్చుకోవడం టీడీపీకి నచ్చలేదు. ఏలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే.. ఆళ్ల నానిని టీడీపీకి చేర్చుకునే విషయంలో కూడా పెద్ద ఎత్తున తర్జనభర్జనలు జరిగిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా.. వైసీపీ నుంచి వస్తున్న నేతలను కూటమి పార్టీలలో చేర్చుకున్న విషయంలో మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ విషయంలో వీరు ఆచితూచి అడుగులు వేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: