- ( అమ‌రావతి - ఇండియా హెరాల్డ్ ) . . .


నారా లోకేష్ అటు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కు స్వయానా మనవడు. మరో విశేషం ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయానా కుమారుడు .. ఎమ్మెల్సీ పైగా మంత్రిగా కూడా క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ఇలాంటి టైం లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ .. తాము అభివృద్ధి అక్కడే చేశాం అని చెప్పుకున్న వేళ 2019 ఎన్నికలలో మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ ఓడిపోయారు. ఎన్నో సానుకూల అంశాల మధ్య మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ 5వేల ఓట్ల తేడాతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే పార్ల‌మెంటుకు వ‌చ్చేసరికి గుంటూరు టీడీపీ ఎంపీగా పోటీ చేసిన గ‌ల్లా జ‌య‌దేవ్‌కు మ‌ళ్లీ 5 వేల కు పైగానే మెజార్టీ వ‌చ్చింది. అసెంబ్లీకి వ‌చ్చే స‌రికి లోకేష్ ఓట‌మి పాల‌య్యారు. ఇక‌ లోకేష్ కు అవే తొలి ప్రత్యక్ష ఎన్నికలు భవిష్యత్తులో పార్టీని నడిపే నాయకుడు అంటున్నారు .. పైగా మంత్రి ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికలలో గెలవలేని వాడు ఇంకా ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు ? అంత సీన్ లేదు అంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి.


ఆ విమర్శలు అన్ని తట్టుకుని ఐదేళ్ల పాటు ఎన్నో కష్టాలు పడి .. అవమానాలు దిగమిందుకొని మరి లోకేష్ పార్టీ కోసం పనిచేశారు. యువ‌గ‌ళం పాదయాత్ర ద్వారా పార్టీని పటిష్టం చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన ఎన్నికలలో అదే మంగళగిరి నుంచి పోటీ చేసి ఏకంగా 92 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టాప్ త్రీ మెజార్టీలలో నారా లోకేష్ మెజార్టీ కూడా ఉంది. ఎక్కడ అయితే 5000 ఓట్ల తేడాతో ఓడిపోయారో .. అక్కడే 92,000 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించి పొలిటికల్గా అసలు సిసలు బ్లాక్ బస్టర్ విజయం అంటే ఎలా ? ఉంటుందో మజా రుచి చూపించారు. ఇక ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా .. క్యాబినెట్ మంత్రిగా తిరుగులేకుండా లోకేష్ దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: