- 2019 ఎన్నిక‌ల‌కు ముందు పెన‌మ‌లూరు తో పాటు పెద‌కూర‌పాడు పై దృష్టి ..!
- అటూ ఇటూ తిరిగి మంగ‌ళ‌గిరిలో పోటీ.. 5 వేల ఓట్ల‌తో ఓట‌మి.. !


- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


2019 ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన లోకేష్ 5 వేల ఓట్ల స్వల్ప తేడా తో ఓడిపోవడం పార్టీ వర్గాలలో తీవ్ర నిరుత్సాహానికి కారణమైంది. వాస్తవానికి అప్పటికే లోకేష్ ఎమ్మెల్సీగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏ నియోజకవర్గమైతే బాగుంటుంది అని లోకేష్ చాలా నియోజకవర్గాల పేర్లు పరిశీలించారు. మంగళగిరి అమరావతి పరిధిలో ఉంటుంది. అప్పటికే రాజధాని అమరావతి పరిధి లో ఎంతో అభివృద్ధి జరుగుతుంది ? పైగా ఆంధ్రప్రదేశ్ కు కాబోయే రాజధాని కావడంతో అక్కడ పోటీ చేస్తే తన గెలుపునకు తిరుగే ఉండదని లోకేష్ భావించారు. అయినా కూడా లోకేష్ ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఓడించారు.


వాస్తవానికి లోకేష్ ఆ ఎన్నికలలో మంగళగిరి తో పాటు కృష్ణా జిల్లాలోని పెనమలూరు - ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాలలో కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చలు అయితే నడిచాయి. ఒకానొక దశలో పెదకూరపాడు లేదా పెనమలూరు నుంచి లోకేష్ పోటీ చేస్తారని అందరూ భావించారు. ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి అనుకూలంగా ఉంటాయ‌న్న కోణంలో నే ఈ ఆలోచ‌న చేశారు. అయితే చివరకు అటూ ఇటూ తిరిగి అమరావతిలో భారీగా అభివృద్ధి జరిగిందందున అక్కడ అయితే తనకు సేఫ్ ఉంటుందని భావించి మంగళగిరి లో పోటీ  చేసిన ఫలితం దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mla