నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి .. మంగళగిరి ఎమ్మెల్యే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులలో మాత్రమే ఉన్నారు. అయితే వాస్తవానికి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే యువనేత .. ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటికీ అయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కూడా .. ఇది లోకేష్ గురించి మరో కోణం. ఇదిలా ఉంటే ఈ ఐదేళ్లలో లోకేష్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని తెలుగుదేశం వర్గాల్లో గట్టిగా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే లోకేష్ జిల్లాల వారీగా తన భవిష్యత్ టీం ను కూడా ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్‌తో రెడీ చేసుకుంటోన్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.
అటు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టి ఇటు కోస్తా తో పాటు అటు రాయలసీమ జిల్లాల్లో తన టీంను.. భవిష్యత్తులో పార్టీ పరంగా తనతో కలిసి వచ్చే టీంను రెడీ చేసుకుంటూ చాపకింద నీరులా ఇది లోకేష్ అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరిగేలా ముందుకు వెళుతోన్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. పలు జిల్లాల్లో యువనేతలకు గత ఎన్నికల్లోనే లోకేష్ పట్టుబట్టి మరీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. చాలా వరకు కొన్ని జిల్లాల్లో సీనియర్లను వ్యూహాత్మకంగా పక్కన పెట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇక 2029 ఎన్నికలు పూర్తిగా లోకేష్ ప్లానింగ్ . . లోకేష్ కనుసన్నల్లో నే జరుగుతాయి అనడంలో సందేహం లేదు. ఇక ఆ ఎన్నికల నాటికి లోకేష్ చాలా నియోజకవర్గాల్లో సీనియర్లను.. పార్టీ పరంగా తనకు తల నొప్పిగా ఉంటారు అనుకున్న నేతలను పక్కన పెట్టేస్తారనే అంటున్నారు. 2029 ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గా లోకేష్ పన్నే వ్యూహాలు ఈ సారి సరికొత్తగా ఉంటాయనడం లో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.