2014లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు నారా లోకేష్ తెరవెనుక చేసిన ప్రయత్నం ఎంతో ఉందన్న విష యం తెలిసింది. అప్పటి వరకు ఉన్న పార్టీ వేరు.. అప్పటినుంచి మారిన పార్టీ తీరు వేరు .. అన్నట్టుగా లోకేష్ పార్టీని కొత్త పుంతలు తొక్కించారు. టీడీపీని డిజిటల్ మార్గం దిశగా అడుగులు వేయించారు. చం ద్రబాబు నాయుడు సైన్యం(సీబీఎన్ ఆర్మీ) పేరుతో యువతను ప్రోత్సహించారు. పార్టీ కోసం పనిచేయిం చారు. చదువుకున్న యువతకు రాజకీయాలు అంటే ఏవగింపు అన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారికి.. అయితే, రాజకీయాలు అస్సలు పడవు. అలాంటివారిని పొలిటికల్ బాటపట్టేలా.. ప్రజా సేవ చేసేలా తనదైన శైలిలో కార్యోన్ముఖులను చేశారు నారా లోకేష్. సదస్సులు, జూమ్ మీటింగుల ద్వారా.. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని జన్మభూమి సేవలో పాలుపంచుకునేలా 2014లోనే వ్యూహాత్మక అడుగులు వేయించారు. ఫలితంగా జగన్ దూకుడుకు అడ్డుకట్టపడి.. పార్టీ అధికారం దక్కించుకోవడంలో నారా లోకేష్ పాత్రను విస్మరించలేం.
ఇక, 2019లో ఎదురైన ఓటమి తర్వాత.. ఇక, నారా లోకేష్ పని అయిపోయిందన్న చర్చ సొంత పార్టీలోనే వినిపించింది. ఇది అక్షర సత్యం. చాలా మంది సీనియర్లు నారా లోకేష్‌ను పక్కన పెట్టడం ప్రారంభిం చారు. అయితే.. వారితో ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండా.. తాను పనితీరును మెరుగు పరుచుకోవడం ద్వారా.. లోకేష్ ముందుకు సాగారు. పాదయాత్ర కష్టమని ఎంతో మంది చెప్పినా.. నారా లోకేష్ వినిపించుకోలేదు.
ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు ఇంతకు మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదని భావించి.. ముందుకు సాగారు. మధ్యలో అనేక ఇబ్బందులు.. సమస్యలు.. కేసులు వచ్చినా.. వెనుదిరగకుండా.. సవాళ్లను ఛేదిస్తూ.. ముందుకు సాగారు. ఇదే.. నారా లోకేష్‌ను మంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే కాకుండా.. ఏపీకి భవిష్యత్తు `నేత`ను అందిస్తోందన్నదివాస్తవం.